Home Cinema Heroine : పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో కనుకోండి చూదాం..

Heroine : పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో కనుకోండి చూదాం..

this-tollywood-star-heroine-is-going-to-get-marry-too-soon

Heroine : ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు వరుసగా మోగుతున్నాయి. సినీ తారలు ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసినదే. ఇంతలో మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. టాలీవుడ్ డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి త్వరలో తన ఒంటరి జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుందట.

డింపుల్ హయాతి విజయవాడలో జన్మించింది మరియు హైదరాబాద్‌లో పెరిగింది. 19 సంవత్సరాల వయస్సులో ఆమె ఓ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. దేవి 2 సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఈ రెండు సినిమాలకు డింపుల్ కు గుర్తింపు రాలేదు. 2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాలోని డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ పాటతో తెలుగులో డింపుల్ యమ పాపులర్ అయ్యింది. కానీ అవకాశం రాలేదు.

tollywood Star Heroine Marry

అవకాశాలు రాకపోవడం, సినిమాల పరాజయం కారణంగా డింపుల్ ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితమైంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో డింపుల్ హయాతి ఏడడుగులు వేయనుందని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. డింపుల్‌ గత కొంత కాలంగా ఓ వ్యాపారవేత్తతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే డింపుల్ స్పందించక తప్పదు.