Home Cinema Akhil Akkineni : నాకు ఆ హీరోయిన్ కావాలి.. ఆ హీరోయిన్ తో ఐతేనే చేస్తా...

Akhil Akkineni : నాకు ఆ హీరోయిన్ కావాలి.. ఆ హీరోయిన్ తో ఐతేనే చేస్తా అంటున్న అఖిల్..

Akhil Akkineni : ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపుగా 8 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ కెరీర్ లో ఒక్క క్లీన్ హిట్ కూడా లేని హీరో అక్కినేని అఖిల్. అక్కినేని నాగార్జున నట వారసుడిగా భారీ అంచనాల నడుమ లాంచ్ అయినా అఖిల్ కి క్రేజ్ అయితే ఇప్పటికీ ఉంది కానీ, సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలడం లేదు, ఒక్కసారి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొడితే కచ్చితంగా ఆయన టాప్ లీగ్ లోకి వెళ్లాడని అభిమానులతో పాటుగా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు(Akhil Wants Pooja Hegde). ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

akhil-akkineni-wants-pooja-hegde

అక్కినేని అఖిల్ కెరీర్ ని రిస్క్ లో పడేసింది. అందుకే ఈసారి సరైన స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు అక్కినేని అఖిల్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఆయన ‘ధీర’ అనే భారీ బడ్జెట్ పీరియాడికల్ జానర్ లో నటించబోతున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్ కోసం గత కొంతకాలం నుండి ఎవరిని తీసుకోవాలి అనే దానిపై మేకర్స్ ఆలోచిస్తూ ఉన్నారు. వారికి పూజా హెగ్డే ని తీసుకోమని అఖిల్ సూచించాడట(Akhil Wants Pooja Hegde). కారణం ఆమెతో తనకి మంచి స్నేహం ఉందని, అంతే కాకుండా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కి కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా, కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో ఆడింది అంటే దానికి కారణం పూజా హెగ్డే.

ఆమెకి యూత్ లో మంచి క్రేజ్ ఉందంటూ చెప్పుకొచ్చాడట అఖిల్. కానీ పూజా హెగ్డే కి రీసెంట్ గా సరైన బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు, ఆమె చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అందుకే మేకర్స్ పూజా హెగ్డే ని తీసుకునేందుకు భయపడుతున్నారు. కానీ ఈ కథ ఆమె కోసమే పుట్టినట్టు ఉంది కాబట్టి ఆమెనే తీసుకోండి అంటూ అఖిల్ పట్టుబడుతున్నాడట. మరి పూజా హెగ్డే కి నిజంగానే మార్కెట్ డిమాండ్ తగ్గిందో, లేదా ఆమె కొంతకాలం బ్రేక్ కావాలని కోరుకుంటుందో సరిగా క్లారిటీ లేదు కానీ, ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్కా తెలుగు సినిమా కూడా లేదు.

ఒప్పుకున్న సినిమాలను కూడా ఆమె రీసెంట్ గానే వదిలేసింది. ఒకవేళ యూవీ క్రియేషన్స్ వారు పూజా హెగ్డే ని తీసుకోవాలని ఆమెని అప్రోచ్ అయినా ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఎలానో సినిమాలు లేక కాలిగా ఉన్న పూజ హెగ్డే వేణు స్వామి దెగ్గరికి వెళ్లి పూజలు చేయించుకుంటుంది. మంచి సినిమా అవకాశాల కోసం పూజ కూడా దేవుడి బాటలో పడింది అనే చెప్పుకోవాలి. మరి వేచి చూడాల్సిందే ఈ బామ్మకు మంచి సినిమా ఆఫర్లు వస్తాయో రావో.

Exit mobile version