Home Cinema Allu Arjun: అల్లు అర్జున్ డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన పవన్ కళ్యాణ్ సినిమా...

Allu Arjun: అల్లు అర్జున్ డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన పవన్ కళ్యాణ్ సినిమా అదేనా?

Allu Arjun: ఇండియా లో మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ తీస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్ తన మొదటి సినిమా నుండే సొంత టాలెంట్ తో పైకి ఎదిగేందుకు ప్రయత్నం చేసాడు. యాక్టింగ్, డ్యాన్స్ మరియు ఫైట్స్ ఇలా అన్ని విభాగాలలో తన మార్కు ని ఉండేలా చూసుకున్నాడు. సినిమాలు బాగున్నా, బాగాలేకపోయిన తన నుండి మాత్రం నూటికి నూరు శాతం ఎఫ్ర్ట్స్ పెట్టి టికెట్ కొన్న అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడు(Allu arjun choreographer). అలా నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించిన అల్లు అర్జున్.

allu-arjun

ఇప్పుడు పుష్ప సినిమా తో ఇండియా మొత్తాన్ని షేక్ చేసి, పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా నిలిచాడు. ఇప్పుడు లేటెస్ట్ గా నేషనల్ అవార్డు ని అందుకొని మన తెలుగు సినిమా స్థాయిని మరోలెవెల్ కి తీసుకెళ్లాడు. అల్లు అర్జున్ లో ఉన్న టాలెంట్స్ మొత్తం మన అందరికీ తెలిసి, కానీ ఆయనలో ఉన్న మరో టాలెంట్ ఇప్పటి వరకు అభిమానులకు కూడా తెలియదు. అల్లు అర్జున్ మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు, మంచి కొరియోగ్రాఫర్ కూడా. తన సినిమాల్లో కొన్ని పాటలకు స్వయంగా కొరియోగ్రఫీ కూడా చేసాడు(Allu arjun choreographer).

కేవలం తన సినిమాలకు మాత్రమే కాకుండా తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘గుడుంబా శంకర్’ చిత్రం లో ‘చిలకమ్మా గూటికి’ అనే పాటకి నృత్య దర్శకుడిగా పని చేసాడు. ఈ పాట చూసేందుకు ఎంతో బాగుంటుంది. ఈ విషయం అప్పట్లో గుడుంబా శంకర్ ఆడియో లాంచ్ అప్పుడూ వేదిక మీద యాంకర్ ఈ విషయాన్నీ తెలియచేస్తుంది. అలా అల్లు అర్జున్ లో ఉన్న ఈ సరికొత్త టాలెంట్ గురించి తెలుసుకొని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇక ఆయన నటించే సినిమాల విషయానికి వస్తే గత కొంత కాలం గా ఆయన ‘పుష్ప : ది రూల్’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం కోసం ఇండియా మొత్తం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 వ తారీఖున ఈ సినిమా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతున్నాడు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

తన షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సినిమా కి డబ్బింగ్ చెపుతున్నాడు. ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందా అని అల్లు అర్జున్ మరియు రష్మిక ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి టైం కి రిలీజ్ అవుతుంది అని సినిమా బృందం తెలియచేసారు.

Exit mobile version