Home Cinema Anasuya : పుష్ప 2 సినిమాలో నా పాత్ర ఏమిలేదు.. అనసూయ కామెంట్స్ వైరల్..

Anasuya : పుష్ప 2 సినిమాలో నా పాత్ర ఏమిలేదు.. అనసూయ కామెంట్స్ వైరల్..

Anasuya : జీవితంలో వచ్చిన రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారు తెలుగు సినిమాలో చాలా మంది ఉన్నారు. మొదటి సారి సినిమాల్లో కనిపించినా తగిన గుర్తింపు, అవకాశాలు రాని చాలా మంది తమ దారి మార్చుకుని మళ్లీ ఇండస్ట్రీకి వచ్చి సూపర్ హిట్స్‌ సినిమాలో నటించి గొప్ప నటులుగా నిలిచారు. ఇక యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ కూడా ఈ లిస్ట్ లో ఉన్న నటీనటుల్లో ఒకరు. అయితే అనసూయ తొలిసారిగా తెరపై కనిపించింది. కానీ అక్కడ ప్రత్యేక గుర్తింపు రాలేదు.

స్మాల్ స్క్రీన్‌పై వ్యాఖ్యాతగా కనిపించిన ఆమె ఒక్కసారిగా లైమ్‌లైట్‌లో కనిపించి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. తను చేసే పాత్రలు గొప్పగా ఉంటేనే నటిస్తా అని అనసూయ ఇంటర్వ్యూలలో తెలిపింది. ఈమె కెరీర్‌ లో గొప్ప పాత్ర అంటే అందరికి గుర్తొచ్చే పేరు రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర. దీని తర్వాత మరోసారి అదే చిత్ర దర్శకుడు నుంచి భారీ చిత్రం పుష్పలో దాక్షాయన్నీ పాత్ర పోషించిన ఆమెకు మరో ఐకానిక్ రోల్ వస్తుందని అందరూ భావించారు.

Anasuya-Pushpa-2-Role

సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో అనసూయ పాత్ర హైలెట్ అయింది. కానీ తీరా సినిమాలో చూస్తే ఏమీ లేదు. అయితే ఇప్పుడు రెండో భాగంలో కూడా అనసూయ పాత్రకు అంత ప్రాధాన్యత లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం, ఆమెను ఓ ఇంటర్వ్యూ లో తన పాత్ర గురించి అడగా, అంత నమ్మకంగా సమాధానం ఇయ్యలేక పోయింది హాట్ బ్యూటీ అనసూయ. పుష్ప రెండో భాగంలో తన పాత్ర గురించి అంతా మా దర్శకుడి చేతిలోనే ఉందని చెప్పింది.

Exit mobile version