Home Cinema Anasuya: ‘అందరకీ నాపైనే కన్ను’ అంటూ అనసూయ సంచలన ట్వీట్.. ఆ హీరోను ఉద్దెశించేనా..

Anasuya: ‘అందరకీ నాపైనే కన్ను’ అంటూ అనసూయ సంచలన ట్వీట్.. ఆ హీరోను ఉద్దెశించేనా..

Anasuya: సోషల్ మీడియా లో తరచూ వివాదాలతో సావాసం చేసే సెలెబ్రిటీల లిస్ట్ తెస్తే అందులో యాంకర్ అనసూయ ముందు వరుస లో ఉంటుంది. ముక్కు సూటితనం తో మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తూ నెటిజెన్స్ నుండి నెగటివ్ కామెంట్స్ ని మూటగట్టుకుంటూ ఉంటుంది (Anchor Anasuya Tweet). ఈమధ్యనే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా లో బోలెడంత నెగటివిటీ ని ఎదురుకున్న అనసూయ, అప్పుడప్పుడు పొట్టి దుస్తులు ధరించి వాటిని తన ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ అకౌంట్స్ లో షేర్ చేస్తూ, ఇద్దరు పిల్లల తల్లివి అయ్యుండి ఇలాంటి ఫోటోలు పెట్టడానికి సిగ్గు లేదా వంటి కామెంట్స్ ని ఎదురుకుంది.

anchor-anasuya-tweet

అలా కామెంట్ చేసిన వారిపై కూడా ఆమె చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇలా సోషల్ మీడియా లో అనసూయ విషయం లో ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ ఎన్ని జరిగినా కూడా ఆమె తన ముక్కుసూటితనం ని పక్కన పెట్టలేదు. రీసెంట్ గా ఆమె ఎవరినో ఉద్దేశిస్తూ తన ట్విట్టర్ అకౌంట్ లో పరోక్షంగా పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘వావ్, నిజంగా నేను కొంతమంది కి ఎంతో ముఖ్యమైన మనిషిని (Anchor Anasuya Tweet). నా ప్రమేయం ఉన్నా లేకపోయినా, నాకు సంబంధం ఉన్నా లేకపోయినా నా పేరు ఎత్తకుండా ఉండలేకపోతున్నారు.

నా మీద అంతలా ఆధారపడి ఉన్నారన్నమాట. నా పేరు లేకుండా పాపం ఏది చెప్పలేకపోతున్నారు’ అంటూ ఎవరినో ఉద్దేశిస్తూ ఆమె వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్ క్రింద మళ్ళీ ఏమైంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ని మళ్ళీ విజయ్ దేవరకొండ ని ఉద్దేశిస్తూ వేసిందా.? లేకపోతే ఇంకెవరినైనా ఉద్దేశించి వేసిందా ? రీసెంట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన ‘బేబీ’ మూవీ విడుదలై మంచి సక్సెస్ ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్ ప్రైవేట్ పార్టీ లో విజయ్ దేవరకొండ ఆమె గురించి ఏదైనా అన్నాడా ?

ఆ విషయం తెలుసుకొని అనసూయ ఇలా కామెంట్స్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది. కచ్చితంగా ఈమె మా హీరో ని టార్గెట్ చేస్తూనే ఈ ట్వీట్ వేసింది అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈమె నోరు విప్పి ఎవరిని టార్గెట్ చేసిందో చెప్పే వరకు ఎవరికీ తోచినట్టు వాళ్ళు ఊహించుకోవడమే. రీసెంట్ గా అనసూయ నటించిన సినిమా విమానాం, ఈ సినిమాలో అనసూయ ఒక వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడింది. ఈ సినిమాలో అనసూయ చాలా హాట్ గా ఉంది అని కూడా చాలా మంది తన అందానికి ఫిదా అయినట్టు ట్విట్టర్ లో తెలిపారు..

Exit mobile version