Home Cinema Animal : అనిమల్ ఫస్ట్ సింగల్ వచ్చేసింది.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన రష్మిక మందన్న..

Animal : అనిమల్ ఫస్ట్ సింగల్ వచ్చేసింది.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన రష్మిక మందన్న..

Animal : రష్మీక మందన్న మరియు బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ లీడ్ పాత్రలలో నటించిబోతున్న చిత్ర అనిమల్. ఈ సినిమా ను టాలీవుడ్ సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నడు. ఈయన గతంలో తీసిన అర్జున్ రెడ్డి విడుదల ముందుకు ఎన్నో చిక్కులల్ల పడింది. మొత్తానికి సందీప్ మొండిపట్టుతో అన్ని ఎదురుకొని ఈ సినిమా ను విడుదల చేసాడు. అర్జున్ రెడ్డి విడుదలై బారి విజయం అందుకుంది. యువత ఈ సినిమా చూసి మంత్రముగ్దులు అయిపోయారు.

animal-movie-first-single-is-out-starring-rashmika-and-ranbir-kapoor

ఇలాంటి లవ్ స్టోరీ పాత దేవదాస్ తరువాత అంత విజయం సాధించిన సినిమా అర్జున్ రెడ్డి అంటూ ఈ సినిమాను ఆకాశానికి లేపారు. ఇది సందీప్ మొదటి సినిమా. ఈయన ప్రస్తుతం బాలీవుడ్ లో అనిమల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేసారు. దానిబట్టి అనిమల్ ఫుల్ ఆక్షన్ సినిమా గా మన ముందుకు రాబోతున్న విషయం తెలుస్తుంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ సింగల్ రేపు విడుదలవబోతుంది అంటూ పోస్ట్ చేసారు ఈ చిత్ర యూనిట్.

ఆ పిక్చర్ లో రన్బీర్ కపూర్ ఇంకా రష్మిక జోరైనా లిప్ లాక్ ఉంది మరియు వీరిద్దరూ ఓ జెట్ పిలేట్స్ గా ఉన్నారు. ఈ పోస్టర్ చూసిన నెటిజనులు ఈ సినిమా అర్జున్ రెడ్డి నే మించి ఉండబోతుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి కొందరు అయితే రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు లిప్ కిస్ లతోనే బతికేస్తున్నారు అంటూ స్పందిస్తున్నారు. ఈ సినిమా ఓ కొడుకు తండ్రి మధ్య లవ్ స్టోరీ అంటూ చెప్పారు కానీ ఇది ఓ రివెంజ్ డ్రామా లా ఉంది అంటూ కొందరు నెటిజనులు కామెట్స్ చేస్తునారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

ఇకపోతే ఇది సందీప్ రెడ్డి వంగా కు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే, ఈ సినిమా హిట్ అయితే ఆయన పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చెయ్యబోతున్న ప్రాజెక్టులు ఆగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే, ఒక సినిమా హిట్ అవ్వగానే కొందరు స్టార్ హీరోలు ఆ డైరెక్టర్ కు డేట్స్ ఇస్తారు. కానీ వారి రెండో సినిమా ప్లాప్ అయితే మాత్రం ఆ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసి ఆ డైరక్టర్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయరు.

ఇలాంటివి మనం బోలెడన్ని చూసాము. ఏదిఏమైనా సందీప్ అనిమల్ సినిమా బారి విజయం సాధించి మన తెలంగాణ వాడైనా సందీప్ రెడ్డి వంగాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాము.

Exit mobile version