Home Cinema Anu Emmanuel : పక్కలోకి వస్తేనే అవకాశాలను ఇస్తాను అంటూ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని...

Anu Emmanuel : పక్కలోకి వస్తేనే అవకాశాలను ఇస్తాను అంటూ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని వేధించిన టాప్ స్టార్..

Anu Emmanuel : కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో అను ఇమాన్యుఎల్ కచ్చితంగా. ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో ఎక్కువ శాతం డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చినవే అవ్వడం విశేషం. న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘మజ్ను’ చిత్రం ద్వారా ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనా విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి ముందే ఈమె మలయాళం లో బాలనటిగా ‘స్వప్న సంచారి’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటుగా అను ఇమాన్యుఎల్ కి మంచి పేరు ని కూడా తెచ్చిపెట్టింది.

anu-emmanuel-actress

ఈ చిత్రం తర్వాత ఆమె 2016 వ సంవత్సరం లో ‘యాక్షన్ హీరో బిజూ’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత తెలుగు లో మజ్ను చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి దగ్గరైంది. ఈ సినిమా అయితే హిట్ అయ్యింది కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ లతో ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ వంటి సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఎంతపెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చాయో మనమంతా చూసాము.

అంత పెద్ద స్టార్ హీరోల సరసన నటించినా ఈమెకి స్టార్ స్టేటస్ దక్కలేదు. ఇక రీసెంట్ గా అల్లు శిరీష్ తో చేసిన ‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం కూడా అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇప్పుడు ఆమె తమిళ హీరో కార్తీ తో కలిసి ‘జపాన్’ అనే చిత్రంలో నటిస్తుంది. కనీసం ఈ చిత్రంతో అయినా ఆమె హిట్ కొడుతుందో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే అను ఇమాన్యుఎల్ కి కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఎదురయ్యాయి అట. అప్పుడు ఆమె వెంటనే తన ఇంట్లో వాళ్లకి చెప్పడం వల్ల ఆ సమస్య నుండి బయటపడినట్టు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అను(Anu Emmanuel) ప్రస్తుతం అల్లు శిరీష్ తో గాఢమైన ప్రేమలో ఉంది, వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అట. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం బహిరంగంగా ఇంకా ఎం చెప్ప లేదు, బహుశా ఇంకా సమయం రాలేదు ఏమో. కానీ అను ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఫాన్స్ కి ఒక టిప్ వదిలింది.

అదేంటంటే అల్లు శిరీష్ అంటే తనకు చాలా ఇష్టం అని, వారిద్దరూ మంచి స్నేహితులు అని, పెళ్లి చేసుకోవాలి అంటే ఎలాంటి వాడు కావలి అని అడగగా, అల్లు శిరీష్ గుణాలు ఉన్నటువంటి కావలి అని ఓపెన్ గా చెప్పేసింది అమ్ముడు.

Exit mobile version