యాంకర్ సుమ బుల్లి తేర సూపర్ స్టార్ అనే చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ 1 యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది యాంకర్ సుమ. బుల్లితెర మాత్రమే కాదు వెండితెర ప్రేక్షకులకు ఈ మలయాళీ బ్యూటీ బాగా సుపరిచితం. ఇండస్ట్రీ లో ఏ పెద్ద హీరో కానీ సినిమా కానీ రిలీజ్ ఐతుంది అంటే దానికి యాంకర్ గా అందరూ ఎంచుకునేది సుమను మాత్రమే.. దానికి కారణం తన కామెడీ, తన మాటతీరు ఇంకా తన ఎనర్జీ. ఇవేవి ఇతర యాంకర్లో ఉండవు కనుక.
మధ్యలో భర్త రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు చాల వార్తలు వినిపించాయి. ఇక ఈ విడాకుల వార్తలు తార స్థాయికి వెళ్లగా ఈ వార్తల పై స్పందిస్తూ అవేమి నిజం కాదని కొట్టిపారేశారు. ఇటీవల తెలుగు మీడియా ఫెడరేషన్ వారు అందరూ సోషల్ మీడియా క్రియేటర్ ని పిలిచి ఒక ఈవెంట్ చేసారు. ఆ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హాజరైయ్యారు.
ఈ ఈవెంట్ కి సుమ కనకాల హోస్ట్ గా నిర్వహించారు. ఇదే ఈవెంట్ లో యాంకర్ సుమ చిరంజీవి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది ఆ సందర్భంలో చిరు తన భార్య సురేఖకు కాల్ చేసి మొన్న నా గ్రెయ్ కోట్, బ్లాక్ ప్యాంటు కనిపించకుండా పోయింది అని బాధపడుతున్నావ్ కదా అది దొరికేసింది సుమ దెగ్గర, అసలు సుమ మన ఇంటికి ఎపుడు వచ్చింది? కోట్ ప్యాంటు ఐతే దొరికేసింది, వచ్చేటప్పుడు తీసుకొని వస్తా. సుమ నా కోట్ నాకు ఇచ్చేయ్ అది నా కష్టాజితంతో కొనుకున్న చాల కాస్టలీ, ఇలా దొంగతనం చేయటం చాలా తప్పు ఇచ్చే అంటూ ఫంనీగా సుమ పరువు తీసేసారు మెగాస్టార్.