Chiranjeevi : ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, అయితే ఆల్ టైమ్ అత్యంత ఇష్టపడే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. అయితే తనతో పనిచేసే హీరోయిన్ల పట్ల చాలా స్నేహంగా ఉండే చిరంజీవి ఎప్పుడు తన హద్దులు దాటలేదు.
ఈయన సరదాగా ఉంటారు కానీ అసబ్యాన్గ ప్రవర్తించనే లేదు. అయితే తన కెరీర్ మొత్తంలో చిరంజీవి చాలా మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కానీ ఒక్క హీరోయిన్ ని మాత్రం ముద్దు పేరుతో పిలుచుకుంటారు అంట. ఆమె మరెవరో కాదు సౌందర్య. అవును, ఇప్పుడు మళ్లీ అదే వార్త ట్రెండ్ అవుతుంది. చిరంజీవి సౌందర్యల కాంబినేషన్‌లో సినిమాలు ఎన్ని వచ్చాయి, ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు.
ఈ కాంబినేషన్‌లో విడుదలైన ప్రతి సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. కానీ సౌందర్యపై ఉన్న ప్రేమ కారణంగా ఆమెను సౌ అని ముద్దుగా పిలిచేవారు. చిరంజీవి ఏ ఇతర హీరోయిన్‌ని ఇలా పిలవలేదు, సౌందర్యను పిలిచాడు. ఈ విషయం స్వయంగా చిరంజీవే అప్పట్లో ఇంటర్వ్యూ లో తెలిపారు. సౌందర్య అతి చిన్న వయసులోనే స్టార్‌గా మారిన సౌందర్య, చిన్న వయసులోనే తిరిగిరాని లోకంలోకి వెళ్లిపోయింది.