Home Cinema Hema : ఇంటర్నెట్ ను ఊపేస్తున్న నటి హేమ మరో వీడియో.. ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజనులు..

Hema : ఇంటర్నెట్ ను ఊపేస్తున్న నటి హేమ మరో వీడియో.. ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజనులు..

Hema : నటి హేమ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈమె బెంగళూరు రేవ్ పార్టీలో భాగమైంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రేవ్ పార్టీలో పలువురు ప్రముఖులు దొరికారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన దీనికి సంబందించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రీకాంత్ ఈ సంఘటనపై స్పందించి, ఈ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు. ఇదిలా ఉంటె, నటి హేమ అందరి కంటే ముందు ఈ రేవ్ పార్టీలో తానూ భాగం కాలేదని తెలిపింది.

అయితే ఈ వీడియో అవాస్తవం అంటూ ఇంటర్నెట్లో వార్తలు గుప్పుమంటున్నాయి. నటి హేమ మీడియాకు ఇచ్చిన వీడియో బెంగుళూరు ఫార్మ్ హౌస్ నుండే తీసి, తానూ హైదరాబాద్ ఫార్మ్ హౌస్ లో ఉందంటూ ఫ్రేమ్ చేసిందట. ఈ వీడియో పోలీసులకు కూడా తేడా అనిపించి ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈవిడ హైద్రాబాద్లో ఉండి ఈ వీడియో తీసిందా లేక, బెంగుళూరు నుండి తీసిందో కొద్దీ రోజులో తేలిపోతుంది. ఇదిలా ఉంటె, నటి హేమ మరో వీడియోను తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసింది.

hema-posted-another-video-to-cover-up-first-one-about-bengaluru-rave-party

ఆ వీడియోలో నటి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తుంది. ఈ వీడియోకు నెటిజనులు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏంటి హేమ ఆంటీ మీరు అసలేం కానట్టే బిర్యానీ వీడియోను పెట్టారు. బానే కవర్ చేస్తున్నారు మీరు. బెంగళూరులో లేను ఇక్కడే హైద్రాబాద్లో ఉన్నటు బలే కవర్ చేస్తున్నావు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కొని రోజులలో ని బండారం బయటపడుతుంది జాగ్రత అంటూ అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version