Friday, July 5, 2024
HomeCinemaJr NTR : రవితేజ 'ఛీ' కొట్టిన కథ తో బ్లాక్ బస్టర్ హిట్ ని...

Jr NTR : రవితేజ ‘ఛీ’ కొట్టిన కథ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా ఇదే..

Jr NTR : ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరొకరు చెయ్యడం , అవి హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం సర్వసాధారణం. ఇలాంటివి రవితేజ విషయం లో ఎక్కువగా జరిగాయి. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ , ‘మిరపకాయ్'(Jr NTR Ravi Teja) ఇలా ఎన్నో చిత్రాలు పవన్ కళ్యాణ్ చేయ్యాల్సినవి. ఆయన వేరే కారణాల చేత ఈ చిత్రాలు చెయ్యకపోవడం వల్ల ఈ చిత్రాలను రవితేజ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.

jr-ntr-movie

అలా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిల్చిపోయినా కిక్ , భద్ర వంటి చిత్రాలు కూడా ముందుగా ఎన్టీఆర్ చెయ్యాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అవి రవితేజ చేతుల్లోకి వెళ్లి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే రవితేజ రిజెక్ట్ చేసిన ఒక సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ‘జై లవకుశ‘ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసాడు, నటుడిగా ఆయన లెవెల్ ని శిఖరానికి చేర్చింది ఈ చిత్రం.

jr-ntr-recieved-huge-success-with-this-film-rejected-by-ravi-teja

అలాంటి సినిమాని డైరెక్టర్ బాబీ ముందుగా రవితేజ కోసం ఈ సబ్జెక్టుని చేసాడట. రవితేజ సంగతి తెలిసిందే కదా, ఏడాది మొత్తం క్యాలండర్ ని నింపేసుకుంటాడు, ఎప్పుడూ షూటింగ్స్ లోనే ఉంటాడు. అందుకే ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఫలితం ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్ర దర్శకుడు బాబీ ని ‘పవర్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ ఇతనికి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు.

jr-ntr-recieved-huge-success-with-this-film-which-rejected-by-ravi-teja

ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఆ తర్వాత చేసిన ఈ జై లవ కుశ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గానే ఈయన మెగాస్టార్ చిరంజీవి తో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం తర్వాత ఇప్పుడు బాలయ్య బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా ఎలా తీస్తాడో చూడాలి, ఒకవేళ ఇది కూడా హిట్ అయితే ఇక స్టార్ లీగ్ లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు(Jr NTR Ravi Teja).

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts