Home Cinema NTR: తనకంటే 12 ఏళ్ళు పెద్ద హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్..

NTR: తనకంటే 12 ఏళ్ళు పెద్ద హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్..

ntr-romance-with-12-years-older-actress

NTR Romance: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయనకీ 18 ఏళ్ళు నిండి మూతి మీద మీసాలు కూడా మొలవని సమయం లోనే మాస్ హీరో గా సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ఇంత చిన్న వయస్సు లో మాస్ హీరో ఇమేజి సంపాదించుకున్న హీరో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఎవ్వరూ లేరు. అయితే అంత పెద్ద ఇమేజి వచ్చిన తర్వాత ఆయన పక్కన నటించే హీరోయిన్స్ కూడా టాప్ రేంజ్ లో ఉన్నవాళ్లే అయ్యుండాలి. ఇండస్ట్రీ లో దాదాపుగా ఆయన అందరి స్టార్ హీరోయిన్స్ తో కలిసి నటించేసాడు.

ntr-romance-with-12-years-older-actress

వారిలో కొంత మంది ఎన్టీఆర్ కంటే వయస్సులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, కానీ అడ్జస్ట్ అయిపోయి నటించేసాడు ఎన్టీఆర్. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ కంటే 12 సంవత్సరాలు పెద్ద, ఆమెతో కలిసి మనోడు రొమాన్స్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె మరెవరో కాదు అమీషా పటేల్(NTR Romance). ఎన్టీఆర్ కంటే ముందే ఆమె తెలుగు లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ తో కలిసి ‘నరసింహుడు’ అనే భారీ ఎపిక్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలో నటించింది. ఈ సినిమాని నిర్మించిన నిర్మాత అప్పట్లో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు అంటూ రూమర్స్ వినిపించాయి.

ntr-amisha-patel

ఇక ఈ చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా అమీషా పటేల్ నటించగా, సెకండ్ హీరోయిన్ గా సమీరా రెడ్డి నటించింది. ఈమె ఎన్టీఆర్ కంటే 12 ఏళ్ళు వయస్సులో పెద్ద, జనాలు అంగీకరించరని జూనియర్ ఎన్టీఆర్ పదే పదే దర్శకుడికి చెప్తున్నా కూడా మాట వినకుండా ఆమెనే ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎంచుకున్నారట. ఎన్టీఆర్ భయపడినట్టుగానే సినిమా ఫలితం ఎలా తారుమారు అయ్యిందో అందరికీ తెలిసిందే. అంతే కాదు, అమీషా పటేల్ తెలుగు లో నటించిన చివరి సినిమా కూడా ఇదేనట, అంత పెద్ద ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం.

ntr-sameera-reddy

ఇక ఎన్టీఆర్ గతం లో జతకట్టిన శ్రీయ, జెనీలియా వంటి వారు కూడా వయస్సు లో జూనియర్ ఎన్టీఆర్ కంటే పెద్ద అని చెప్తున్నారు. అలా చిన్న తనం లో సినిమాల్లోకి రావడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అలా వయస్సులో తనకంటే పెద్ద వాళ్ళతో నటించాల్సి వచ్చిందని టాక్. ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా దేవర, ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే ఈ సినిమా లో ఇటీవలే ఒక కొత్త ఆర్టిస్ట్ ని ఎన్టీఆర్ అత్తగా నటించటానికి ఎంపిక చేసుకున్నారు. ఆ నటి ఎవరో కాదు రమ్య కృష్ణ. రమ్య కృష్ణ ఎన్టీఆర్ అత్తా అల్లుడిలా అప్పట్లో రెండు సినిమాలు చేసారు. అత్తా అల్లుడిలా ఎన్టీఆర్ రమ్య కృష్ణ నటించటం ఇది మూడో సినిమా కావటం విశేషం.