Home Cinema Balakrishna-Kajal: రేపే భగవత్ కేసరి సినిమా రిలీజ్.. పెద్ద బాంబు పేల్చిన కాజల్ అగర్వాల్..

Balakrishna-Kajal: రేపే భగవత్ కేసరి సినిమా రిలీజ్.. పెద్ద బాంబు పేల్చిన కాజల్ అగర్వాల్..

Balakrishna Kajal Agarwal: బాలకృష్ణ కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తున్న సినిమా భగవత్ కేసరి. ఈ సినిమా రేపు 19-10-23 రిలీజ్ కి సిద్ధం అవుతుంది. నందమూరి అభిమానులు కాజల్ అగర్వాల్ అభిమానులు ఎప్పటి నుండో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది. కాజల్ అగర్వాల్ ఒకపుడు మంచి టాప్ హీరోలతోనూ డైరెక్టర్ లతోను నటించింది, ఏ హీరోయిన్ చూడనటువంటి సక్సెస్ ను కాజల్ అగర్వాల్ చూసింది.

kajal-aggarwal

మంచి టాప్ హీరోలు కూడా తిన డేట్ ల కోసం ఎదురు చూసే వారు అంటే కాజల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోండి. అలాంటీ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బాబుని కూడా కనింది. హీరోయిన్ లకు పెళ్ళైతే పెద్దగా అవకాశాలు రావు ఇది అందరికి తెలిసిన సత్య. కాజల్ తన పీక్స్ టైం లో ఉన్నపుడు పెళ్లి చేసుకుంది, ఇక అందరూ కాజల్ పని ఐపోయింది ఇక ఇంట్లో కూర్చొని పిల్లోడితో ఆడుకోవాల్సిందే అని అనుకున్నారు.

పెళ్లయిన 2 ఏళ్ళు కాజల్ సినిమాలకు దూరంగానే ఉంది. కానీ భర్త గౌతమ్ కిచ్లు ప్రోత్సాహంతో మల్లి తన సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది. వెంటనే కాజల్ కు మంచి అవకాశాలు రావటం మొదలైయ్యాయి. ఇపుడు తిను నటిస్తున్న భగవత్ కేసరి కూడా మొదట్లో చేయను అని చెప్పింది అట కాజల్ అగర్వాల్(Balakrishna Kajal Agarwal), కానీ భర్త గౌతమ్ తనను ఒప్పించాడు అట ఈ సినిమా చేయాలి అని. ఇక విషయానికి వస్తే భగవత్ కేసరి సినిమా ప్రమోషన్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతుంది.

ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కాజల్ తన పాత్ర గురించి చెప్పుకొస్తూ ఇలా అనింది “ఈ సినిమా ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి తండ్రులు కచ్చితంగా చూడాల్సిన సినిమా, ఈ మధ్య కాలం లో వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయో మనమందరం చూస్తున్నాం, కానీ ఈ సినిమా వాటికి చాలా బిన్నంగా ఉండబోతుంది. ఒక తల్లిగా ఇలాంటి సినిమా చేయటం నాకు చాల సంతోషంగా ఉంది.

ఈ సినిమాలో నా పాత్రకు మీరందరు చాల హ్యాపీ గా ఫీల్ అవుతారు అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది. థియేటర్ ల దెగ్గర బాలకృష్ణ అభిమానుల సందడి ఆల్రెడీ మొదలైపోయింది. భగవత్ కేసరి సినిమా గాని హిట్ ఐతే ఇక బాలకృష్ణ అభిమానులను ఎవ్వరు ఆపలేరు, రచ్చ రచ్చే.

Exit mobile version