Home Cinema Kajal Aggarwal : ఒక వ్యక్తి నా క్యారవాన్ లోకి వచ్చి తన బట్టలు తీసేసాడు.....

Kajal Aggarwal : ఒక వ్యక్తి నా క్యారవాన్ లోకి వచ్చి తన బట్టలు తీసేసాడు.. కాజల్ సంచలన వ్యాఖ్యలు..

Kajal Aggarwal : లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్. అంతకు ముందు ఓ హిందీ సినిమాలో సైడ్ పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత కాజల్ కు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ అందాల బ్యూటీ చందమామ, మగధీర, గణేష్, ఆర్య 2, బృందావనం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, వీర, గోవిందుడు అల్లరివాడేలే, టెంపర్ వంటి పలు చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికల్లో ఒకరిగా స్థానం సంపాదించుకుంది.

ఈమెకు బోలెడంత మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే పెళ్లయ్యాక కొడుకు పుట్టాక తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలే పోషిస్తూ గ్లామర్‌ పాత్రలు వస్తే పక్కన పెటేస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సత్యభామ అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది మరియు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కాజల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు, మీ అభిమానులతో మీరు అనుభవించిన అన్ని క్రేజీ విషయాలను చెప్పమని హోస్ట్ కాజల్ ను అడుగుతుంది.

kajal-aggarwal-shared-awkward-moments-with-fans-which-she-faced

దీనికి స్పందిస్తూ కాజల్ తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటన తనను చాలా భయపెట్టింది అని చెప్పుకొచ్చింది. కాజల్ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో క్యారవాన్ లో కూర్చున్నప్పుడు ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి తన షర్ట్ మొత్తం తీసేసాడు. ఆ క్షణంలో ఈ మనిషి ఏం చేస్తాడోనని తెగ భయపడను. కానీ అతను నా మీద ఉన్న ప్రేమతో నా పేరును తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. పచ్చబొట్టు చూపించడానికి, అతను తన చొక్కా తీసి ఇలా చేసాడు. ఎప్పుడూ ఇలా చేయకు అంటూ అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాను.

Exit mobile version