Home Cinema కెమెరాకు చిక్కిన మెగా ప్రిన్సెస్ క్లిన్ కార మొఖం.. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్...

కెమెరాకు చిక్కిన మెగా ప్రిన్సెస్ క్లిన్ కార మొఖం.. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ అంటున్న ఫాన్స్..

ఈరోజు మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తిరుమల వెంకన్న ను దర్శించుకునేందుకు రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కార సోమవారం తిరుమల చేరుకున్నారు. ఉదయాన్నే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలతో తమ రోజుని ప్రారంభించారు. తమ కూతురు క్లిన్ కార కు ఉన్న మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుమలలో ఉన్న అభిమానులు ఊరుకుంటారా తమ హీరో తిరుపతి వచ్చాడు అని తెలిస్తే.

అభిమానులు అందరూ తిరుమల చేరుకొని తమ హీరో కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇప్పటి వరకు క్లిన్ కార మొఖం ఎవ్వరు చూడలేదు. సోషల్ మీడియా లో చాల ఫోటోలు వచ్చాయి కానీ అవన్నీ ఫేక్. మొట్ట మొదటి సారి క్లిన్ కార మొఖం కెమెరాకు చిక్కింది. రామ్ చరణ్ ఉపాసన దర్శనం చేసుకునేందుకు లోపలికి వెళ్తుండగా క్లిన్ కార మొఖం కెమెరా లో స్పష్టంగా కనిపించేసింది.

ram-charan-upasana-thirumala-visit-on-ram-charan-birthday

ఇప్పుడు అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. తమ ఇష్టమైన హీరో పుట్టినరోజు నాడు తమకు క్లిన్ కార పేస్ రెవీల్ అవ్వటం తమకు చాల సంతోషం కలిగిస్తుంది అంటూ నెటిజనులు ఈ వీడియో ని తెగ షేర్ చేస్తున్నారు.

Exit mobile version