Home Cinema Mamitha Baiju : తన కెరీర్ స్టార్టింగ్ లోనే అలాంటి పని చేయబోతున్న మమిత బైజు.....

Mamitha Baiju : తన కెరీర్ స్టార్టింగ్ లోనే అలాంటి పని చేయబోతున్న మమిత బైజు.. కెరీర్ రిస్క్ చేస్తుంది..

Mamitha Baiju : అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అప్పుడపుడు ఐటెం పాటలో స్టెప్పులు వేస్తుంటారు. దాదాపు ఏ బ్యూటీ అయినా ఆఖరికి ఏదో ఒక సినిమాలో ఐటెం పాటలో నటిస్తుంది. పరిస్థితిలు అప్పుడపుడు ఆలా డిమాండ్ చేస్తాయి. అయితే కెరీర్ ప్రారంభంలో ఐటెం సాంగ్ సాంగ్స్ లో నటించిన హీరోయిన్లు చాలా తక్కువ. ఈ జాబితాలో ఇపుడు మలయాళ హాట్ బ్యూటీ మమితా బైజు కూడా చేరింది. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన మమితా బైజు తెలుగులోనూ మంచి అవకాశాలను అందుకుంది.

ప్రెజెంట్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాలో కనిపించనున్నాడు. అదే విధంగా రామ్ చరణ్ తో మరో సినిమాలో నటించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ బ్యూటీకి మలయాళంలో ఓ పెద్ద ఆఫర్ వచ్చింది. ఐటెం సాంగ్ లో ఈ బ్యూటీ నటించనున్న సంగతి ఇప్పటికే ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. నిన్న మొన్న తన కెరీర్ స్టార్ట్ చేసిన మమితా బైజు ఐటెం సాంగ్ చేయనున్న సంగతి తెలిసి అవాక్కవుతున్నారు జనాలు.

mamitha-baiju-risking-her-career-by-accepting-to-act-in-item-song

అయితే మమిత అభిమానులు మాత్రం తానూ ఓ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మమిత బైజు మాత్రం ఈ వార్తా పై అధికారికంగా ప్రకటించలేదు. కానీ నిప్పులేనిదే పొగ రాదు అన్నట్లు మమిత ఐటెం సాంగ్ లో నటించడానికి ఓకే చెప్పకపోతే అసలు న్యూస్ బయటకు ఎలా వస్తుంది అని నెటిజనులు అభిప్రాయం. ఏదిఏమైనా ఆమె కెరీర్ కు ఇది ఉపయోగపడితే అదే చాలు అంటున్నారు ఆమె అభిమానులు.

Exit mobile version