Mega Family : గత కొన్ని రోజులుగా చిరంజీవి కుటుంబంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కుటుంబం చలనచిత్ర పరిశ్రమకు చెందినది కాబట్టి వారు సాధారణంగా తాము చేస్తున్న సినిమాలు మరియు వారి షెడ్యూల్ గురించి వివరాలను పంచుకోవడం సహజం. కానీ ఈ సారి ఈ కుటుంబం పాలిటిక్స్ వాళ్ల ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
మరుసటి రోజు నంద్యాల వెళ్లి వైసీపీ తరపున పోటీ చేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో మెగా ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. రవిచంద్ర తనకు మిత్రుడని, ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వడం లేదని అల్లు అర్జున్ తెలిపాడు. ఇది తెలుసుకున్న చిరంజీవి సోదరుడు నాగబాబు ఇటీవల బన్నీకి పరోక్షంగా ట్వీట్ చేసాడు మరియు ఇపుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ నాగబాబు ఏమని ట్వీట్ చేసాడో మనం ఇక్కడ తెలుసుకుందాం.
నాగబాబు చేసిన ట్వీట్ వివరాలు ఇక్కడ చుడండి. మాతో ఉంటూ మా ఒప్పొసిన్ ను సపోర్ట్ చేసేవాడు మా వాడు అయినా పరాయి వాడే. మనతో నిలబడేవాడు పరాయివాడు అయినా మనవాడే అంటూ అల్లు అర్జున్‌ని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేసినట్లు అందరికీ అర్థమైంది. ఇది తెలుసుకున్న చిరంజీవి నాగబాబుపై సీరియస్ అయి వార్నింగ్ ఇచ్చాడట. మన కుటుంబ పరువు మనమే తీసుకుంటున్నాము అని నాగబాబు కు క్లాస్ పీకాడట చిరు.