Home Cinema Sai Dharam Tej : పెళ్ళికి సిద్దమైన మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్.. అమ్మాయి...

Sai Dharam Tej : పెళ్ళికి సిద్దమైన మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్.. అమ్మాయి ఎవరో కాదు..

Sai Dharam Tej : మెగా వారసురాలు క్లింకర పుట్టిన ప్రత్యేకత ఏమిటో కానీ మెగా ఫ్యామిలీలో వరుస గా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. RRR చిత్రంలో నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు, వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి, ఆ తర్వాత చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు, చిరంజీవి భార్య సురేఖ అత్తమ్మ కిచెన్ ఇలా ఎన్నో వేళా విశేషాలు ఈ కుటుంబంలో జరిగాయి. ఇదంతా ఒక ఎత్తయితే మెగా అభిమానులు ఎప్పటినుండో కలలు కనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడు.

పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా వరుస వేడుకలు జరగడంతో మెగా ఫ్యామిలీ నుండి మెగా అభిమానుల దాక సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, మెగా ఇంట్లో మరో వేడుక జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఇది ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

sai-dharam-tej-marriage-news-is-all-over-internet

పెళ్లికూతురు కూడా ఓ వ్యాపారి కూతురేనని టాక్ నడుస్తుంది. ఈ సంబంధం మెగా ఫ్యామిలీకి కూడా నచ్చిందని అంటున్నారు. మరి ఇది నిజం అని తెలవాలంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే. ప్రస్తుతం తేజ్ గంజా శంక‌ర్ సినిమా అనౌన్స్ చేశాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కి పోక ముందే ఆగిపోయింది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని విషయంపై క్లారిటీ లేదు. తేజ్ ఇంకా వేరే సినిమాలు కూడా ఏమి ఓకే చేయలేదు.

Exit mobile version