Home Cinema Nag Ashwin : “రాజమౌళి” ని తలదన్నే దర్శకుడు వచ్చాడు.. నాగ్ అశ్విన్ రిప్లై..

Nag Ashwin : “రాజమౌళి” ని తలదన్నే దర్శకుడు వచ్చాడు.. నాగ్ అశ్విన్ రిప్లై..

Nag Ashwin : ఈ మధ్యలో ఎక్కడ చూసినా దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మారుమోగుతోంది. దీనికి కారణం కూడా మనకు తెలుసు. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కల్కి. జూన్ 27న వరల్డ్ వైడ్ గా విడుదలై సూపర్ హిట్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్స్ ని వసూలు చేసింది. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రభాస్ పేరు కంటే దర్శకుడు నాగ్ అశ్విన్‌ని మెచ్చుకుంటు ఆకాశానికి ఎగిరేస్తున్నారు. ఈయన వల్లే ఇంత అద్భుతమైన సినిమా కల్కి మనం చూడగలిగాము.

నెటిజనులు ఇప్పుడు దర్శకుడు అశ్విన్‌ని రాజమౌళితో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళి కి ఇప్పుడు సరైన మొగుడు వచ్చాడు రా అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినిమా ఘనవిజయం తర్వాత తొలి మీడియా మీట్‌లో నాగ్ అశ్విన్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా, ఒక రిపోర్టర్ ఈ విషయం గురించి నాగ్ అశ్విన్ కు తెలిపారు. దానికి సమాధానం ఇస్తూ దర్శహకుడు ఇలా అన్నారు, అందరూ అనడం లేదు, మేరె అంటున్నారు అని నవ్వుతు అన్నారు.

Nag Ashwin Beats Rajamouli

ఆ తరువాత అదే రిపోర్టర్, ఈ సినిమాటిక్ యూనివర్స్ లో మహేష్ బాబును కృష్ణుడిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారని అని అడగ్గా నాగ్ అశ్విన్ మహేష్ తో ఓ కొత్త సినిమా తీయాలనుకుంటున్న అని అన్నారు. దీంతో నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎట్టకేలకు రాజమౌళి లాంటి దర్శకుడుని ఇండస్ట్రీకి తలదన్నే దర్శకుడు వచ్చాడు అంటూ అంటున్నారు నెటిజనులు.

Exit mobile version