Home Cinema Anushka-Naga Chaitanya : నాగ చైతన్య అనుష్క పెళ్లి అప్పట్లో క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా..?

Anushka-Naga Chaitanya : నాగ చైతన్య అనుష్క పెళ్లి అప్పట్లో క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా..?

Naga Chaitanya Anushka Marriage : టాలీవుడ్ లో ఒక హీరో హీరోయిన్ కలిసి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తే వాళ్ళ మధ్య ఎదో జరుగుతుంది అంటూ మీడియా లో వార్తలు రావడం కొత్తేమి కాదు. మొదటి నుండి ఇది జరుగుతున్నదే. అలా అప్పట్లో అక్కినేని నాగార్జున మరియు అనుష్క మధ్య ఎదో జరుగుతుందని, వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ మీడియా లో ఒక వార్త సంచలనం రేపింది. అయితే అలాంటిది ఏమి లేదంటూ అనుష్క పలు ఇంటర్వూస్ లో తెలిపింది. నాగార్జున గారు నాకు గురువు తో సమానం, నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఆయనే, ఆయన వల్లే ఈరోజు నేను ఇండస్ట్రీ లో ఈ స్థానం లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

anushka-shetty-naga-chaitanya

నాగార్జున తో కలిసి అనుష్క డాన్, సూపర్, డమరుకం మరియు రగడ వంటి సినిమాలు చేసింది. ఇందులో రగడ సినిమా తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ గా ఫ్లాప్స్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లోకి రాకముందు అనుష్క వృత్తి యోగా అని మన అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె ప్రముఖ సెలబ్రిటీస్ కి కూడా యోగా క్లాసులు తీసుకునేది. అలా నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య కి కూడా ప్రత్యేకంగా యోగా క్లాసులు తీసుకునేదట. ఆ సమయం లోనే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రిక లో వార్త వచ్చింది(Naga Chaitanya Anushka Marriage).

ఆ తర్వాత అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు గాను నాగార్జున నుండి సీరియస్ వార్నింగ్ రావడం తో ఆంధ్ర జ్యోతి యాజమాన్యం క్షమాపణలు చెప్పి, ఆ తప్పుడు వార్త ని వెనక్కి తీసుకుంది. చాలా కాలం తర్వాత ఈ వార్త సోషల్ మీడియా లో బయటపడడం తో వైరల్ గా మారింది. ఇక అనుష్క కాస్త గ్యాప్ తీసుకొని రీసెంట్ గా మన ముందుకి వచ్చిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమా పెద్ద హిట్ అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రారంభం లో ఓపెనింగ్స్ కాస్త తడబడిన ఫుల్ రన్ లో మాత్రం స్టడీ గా వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.

అలాగే నాగ చైతన్య రీసెంట్ సినిమాలన్నీ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వం లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి పెద్ద సమాచారం ఐతే లేదు కానీ నాగ చైతన్య ఇటీవలే ముంబై వెళ్లి అక్కడ జాలరులని కలిసాడు. వారిని కలిసి వారి కష్టాల గురించి తెలుసుకున్నాడు.

దీనితో సినిమా వాలా టాపిక్ మీదే ఉండబోతుంది అని ఫాన్స్ గుసగుస లాడుకుంటున్నారు. ఇక అనుష్క విషయానికి వస్తే మొన్న నవీన్ పోలిశెట్టి తో సినిమా హిట్ కొట్టి ఎంజాయ్ చేస్తుంది.

Exit mobile version