సమంత నాగ చైతన్య టాలీవుడ్ లోనే టాప్ కపుల్ గా ఉండేవారు. వీరిద్దరూ ఏమాయ చేసావే సినిమా చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 4 ఏళ్ళు ప్రేమించుకుని ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న 4 ఏళ్లకే ఏవో మనస్పర్థలు రావటంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇది అప్పుడు చాల పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏ న్యూస్ చుసిన వీళ్ల గురించే చర్చ.
ఆ తరువాత సమంత(Samantha) మయోసిటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరం అయింది. ఇప్పుడిపుడే కోలుకుంటూ మల్లి సినిమాలు చేస్తుంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. విడాకుల తరువాత సమంత చాలా సైలెంట్ అయింది, కానీ నాగ చైతన్య(Naga Chaitanya) మాత్రం శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) అనే హీరోయిన్ తో తిరుగుతూ వార్తల్లో నిలిచాడు. మొదట్లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి.
నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. తాజాగా నాగ చైతన్య తన సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు చర్చనీయాంశం గా మారాయి. చైతు అప్లోడ్ చేసిన ఫోటోను శోభిత లైక్ చేసింది. దీనితో డేటింగ్ రూమర్స్ మల్లి మొదలైయ్యాయి. కొందరు నెటిజనులు ఐతే ఇద్దరు కలిసే వెళ్లారు వెకేషన్ కి, తను పక్కనే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.