Home Cinema Naga Shourya: ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసినందుకే నాగ శౌర్య పెళ్లి చేసుకున్నాడా..?

Naga Shourya: ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసినందుకే నాగ శౌర్య పెళ్లి చేసుకున్నాడా..?

Naga Shourya: టాలెంట్ ఫుల్లుగా ఉన్నప్పటికీ అదృష్టం, కాలం కలిసిరాక ఇంకా మీడియం రేంజ్ హీరోస్ లో ఒకడిగా మిగిలిపోయిన వారిలో నాగ శౌర్య ఒక్కడు. ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ శౌర్య తొలి సినిమాతోనే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో టాలీవుడ్ కి మరో నాని లాంటి హీరో వచేసాడు అని అందరూ అనుకున్నారు. అందం ఉంది, టాలెంట్ ఉంది కానీ నాని లాగ స్క్రిప్ట్ సెలక్షన్ చేయకపోవడం తో కెరీర్ లో హీరో గా రెండు మూడు సక్సెస్ లను మాత్రమే చూసాడు.

naga-shourya-anushka

ఇక రీసెంట్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా దట్టించి, ఆయన చేసిన ‘రంగబలి’ అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక నాగశౌర్య(Naga Shourya) పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నాగ శౌర్య రీసెంట్ గానే అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా మంది కన్ఫ్యూజ్ కి గురై అనూష శెట్టి ని అనుష్క శెట్టి అని పిలిచేస్తుంటారు. అయితే నాగ శౌర్య ఈమెని పెళ్లి చేసుకోవడానికి కారణం అనుష్క శెట్టి అట. ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఆయన నాకు అనుష్క శెట్టి అంటే పిచ్చి ఇష్టం అంటూ తన ఇష్టాన్ని తెలిపిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఆమెతో కలిసి నటించే ఛాన్స్ రాకపోయినా పర్వాలేదు కానీ, ఒక్కసారి ఆమెని కలిసే ఛాన్స్ వచ్చినా చాలు అనుకుంటాను అంటూ నాగ శౌర్య ఎన్నో సందర్భాలలో అనుష్క పై తనకి ఉన్న పిచ్చి ప్రేమని చెప్పుకొచ్చాడు. ఆమెని ఎలాగో పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు కనుక, ఆమె పేరు కలిసొచ్చేలా ఉన్న అనూష శెట్టి ని పెళ్లి చేసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. వీళ్లిద్దరి పెళ్లి పెద్దలు కుదిరించినది. ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత నాగ శౌర్య కేవలం ఈ పేరుని చూసి ఓకే చేసాడట. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక పోతే నాగ శౌర్య ప్రస్తుతం ‘పోలీస్ వారి హెచ్చరిక’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి సినిమాల్లో హీరో గా నటిస్తున్నాడు. రంగబలి ప్లాప్ తరువాత నాగ శౌర్య చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. మల్లి ఒక మంచి హిట్ కొడితే గని సినిమా అవకాశాలు రావు, హిట్ కొట్టాలి అంటే అసలు సినిమాలు ఉండాలి. నాగ శౌర్య పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది అని అనుకుంటున్నారు ఫాన్స్.

Exit mobile version