Home Cinema ప్రూఫ్ తో సహా అడ్డంగా దొరికి పోయిన నాగ చైతన్య శోభిత.. ఈ సారి ఏంచేశారంటే..

ప్రూఫ్ తో సహా అడ్డంగా దొరికి పోయిన నాగ చైతన్య శోభిత.. ఈ సారి ఏంచేశారంటే..

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా లో నాగ చైతన్య గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారమైన సంగతి మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక ప్రచారం గత రెండేళ్ల నుండి కొనసాగుతూనే ఉంది. దీనిపై నాగ చైతన్య పరోక్షంగా రెండు మూడు సార్లు ఖండించిన కూడా జనాలు నమ్మట్లేదు(Nagachaitanya sobhita caught redhanded)రకు సోషల్ మీడియా లో ఎన్నో లీక్ అయ్యాయి. ఇవన్నీ గమనిస్తే కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుంది అనే విషయం మాత్రం స్పష్టం అవుతుంది.

Sobhitha-Dhulipala

ఇకపోతే రీసెంట్ గా వీళ్లిద్దరు మరోసారి సోషల్ మీడియా సాక్షిగా దొరికిపోయారు. అది ఎలా దొరికారు అనేది ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్య తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో రీసెంట్ గా గ్రీన్ లైట్ అనే పుస్తకం గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ పుస్తకం చదువుతుంటే జీవితానికి ఒక ప్రేమ లేఖ రాసినట్టుగా అనిపించింది. ఈ జీవిత ప్రయాణాన్ని ఈ పుస్తకం ద్వారా మాతో పంచుకున్నందుకు చాలా కృతఙ్ఞతలు మాథ్యూ మాక్కనౌగే సార్’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. నాగ చైతన్య ఈ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే శోభిత దూళిపాళ్ల కూడా పెట్టింది.

ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకం ఇదే’ అంటూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది(Nagachaitanya sobhita caught redhanded). నాగ చైతన్య సజస్ట్ చెయ్యడం వల్లే ఆమె ఆ పుస్తకమ్ చదివిందని, వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు అనడానికి ఇది మరో ఉదాహరణ అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి ఇంకా రాకపోవడం వల్లే, వీళ్లిద్దరు బహిరంగంగా రిలేషన్ లో ఉన్నాము అనే విషయాన్నీ బయటపెట్టడం లేదని అంటున్నారు ఫ్యాన్స్.

మరి వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన వార్త వినాలని ఎదురు చూస్తున్న అభిమానులు ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలో అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇటీవలే వీళిద్దరూ కలిసి లండన్ పుబ్బులో తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడి నుండి ఫాన్స్ కు నాగ చైతన్య తినను పెళ్లి చేసుకుంటాడు ఏమో అన్న అనుమానం మొదలు అయ్యింది.

రోజులు గడిచే కొద్దీ ఈ అనుమానం నిజంగా మారటం మొదలు అయింది. వీళ్లిద్దరు కలిసి తిరుగుతున్న ఫోటోలు మరెన్నో బయట పడటం మొదలు అయ్యాయి. నాగార్జున కి కూడా ఈ సంబంధం ఇష్టమే అని సినీ వర్గాల్లో టాక్ జోరుగా నడుస్తుంది. విల్లు కానీ పెళ్లి చేసుకుంటే ఇక అక్కినేని ఫాన్స్ కి పండగ అనే చెప్పాలి. వేచి చూదాం ఈ జంట ఎం చేస్తారో.

Exit mobile version