Home Cinema Nagarjuna: కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న నాగార్జున..

Nagarjuna: కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న నాగార్జున..

Nagarjuna: నిన్నటి తరం స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చప్పనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వర రావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున తండ్రిని మించిన తనయుడిగా ఇండస్ట్రీ లో ఎదిగాడు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను చేసి కమర్షియల్ సక్సెస్ లు అందుకొని టాలీవుడ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన నటుడు ఆయన(Nagarjuna Ashika Ranganath). ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అంటే పెద్ద రేంజ్ లాగ మారిపోయింది. కానీ మన తెలుగు సినిమాకి మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ ఎవరు అంటే అది అక్కినేని నాగార్జుననే.

hero-nagarjuna

ఈయన హిందీ లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ మరియు అనిల్ కపూర్ వంటి సూపర్ స్టార్స్ తో కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసి భారీ హిట్స్ ని అందుకున్నాడు. అలాగే తమిళం లో గీతాంజలి చిత్రం అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో నాగార్జున తమిళ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. అలా వచ్చిన పాపులారిటీ తో తమిళం లో ‘రక్షకుడు’ అనే చిత్రం కూడా చేసాడు. అలా అన్ని భాషల్లో మంచి క్రేజ్ ని దక్కించుకొని మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాగార్జున, ఇప్పుడు తనకి ఉన్న మార్కెట్ మొత్తాన్ని కోల్పోయి స్టార్ రేస్ లో వెనకబడిన సంగతి అందరికీ తెలిసిందే.

కమర్షియల్ సినిమాలకు దూరంగా ఇప్పటికీ ఆయన ప్రయోగాలు చెయ్యడం, అవి వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఈసారి ఎలా అయినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి, పూర్వ వైభవం ని దక్కించుకోవాలని అనుకుంటున్నాడు నాగార్జున(Nagarjuna Ashika Ranganath). అందుకే ప్రసన్న కుమార్ అనే డైరెక్టర్ తో ‘నా సామి రంగ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది చాలా కాలం తర్వాత నాగార్జున నుండి వస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా. సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. రీసెంట్ గా నాగార్జున పుట్టినరోజు నాడు విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ అనే అమ్మాయిని తీసుకున్నారు. ఈమె కన్నడ లో పెద్ద స్టార్ హీరోయిన్, తెలుగు లో అమిగోస్ అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఈమె వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. నాగార్జున వయస్సు 64 ఏళ్ళు. అంత వయస్సు ఉన్న వాడితో సినిమా ఏమిటి అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు. మరి డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఆడియన్స్ ని ఎలా ఒప్పిస్తాడో తన టేకింగ్ తో చూడాలి.

నాగార్జున ప్రస్తుతం నా సామీ రంగ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా పై అక్కినేని అభిమానులకు బారి అంచనాలే ఉన్నాయి.

Exit mobile version