Home Cinema Naresh : మహేష్ బాబుపై ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన నరేష్.. ఇంటర్నెట్ లో హల్చల్..

Naresh : మహేష్ బాబుపై ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన నరేష్.. ఇంటర్నెట్ లో హల్చల్..

Naresh : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పని లేదు. ఈయనకు బోల్డంత ఫ్యాన్ ఫాల్లోవింగ్ ఉంది. తనదైన శైలిలో రేసుల్లో దూసుకుపోతున్నాడు. అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు చిత్ర యూనిట్. అదే విధంగా మహేష్ సోదరుడు నరేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇస్తూ మహేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన మహేష్ బాబు గారి గురించి ఎం మాట్లాడాడో మనం ఇక్కడ తెలుసుకుందాం. యాక్టర్ నరేష్ తన పాతరోజులు గుర్తుతెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడుతూ నేను చాలా లావుగా ఉండేవాడిని. అమ్మ వండిన ఆహారం తిని చాలా లావుగా అయిపోయాను. మా అమ్మగారు అంత మంచిగా వండుతుంది. కానీ ఇప్పుడు నేను నా ఆహారం మార్చుకున్నాను. ప్రస్తుతం బాదం, ఎండుద్రాక్ష మరియు ఎండు ఖర్జూరాలను నానబెట్టి నీరు తాగుతాను. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటున్న.

naresh-interesting-comments-on-mahesh-babu-in-a-recent-interview

నరేష్ మాట్లాడుతూ కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉండేది. మహేష్ బాబుకి మా అమ్మ వండిన మటన్ గోంగూర బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. మహేష్ బాబు కూడా ఆహార ప్రియుడా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. చాలా ఇంటర్వ్యూలలో, అభిమానులు అతని బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ చాలా సింపుల్ గా ఎలా ఉంటారో చెప్పుకొచ్చారు. నరేష్ మహేష్ బాబుకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టి సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా పాపులర్ అవుతుంది.

Exit mobile version