Sreeleela: ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్ళలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీలీల ఆ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం బలంగానే వచ్చాయి. అలా రెండవ సినిమా మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం లో చెలరేగిపోయి మరీ నటించి, డ్యాన్స్ వేసి ఆ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది శ్రీలీల (Pooja Hegde Sreeleela).
ఈ చిత్రం తర్వాత ఆమె దర్శక నిర్మాతల దృష్టిలో బాగా పడింది. ఏకంగా 8 సినిమాల్లో హీరోయిన్ గా బుక్ అయ్యి సంచలనం సృష్టించింది. ఈ 8 సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రామ్, నందమూరి బాలకృష్ణ వంటి క్రేజీ స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పోతే శ్రీలీల ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండడానికి కారణం ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే అట (Pooja Hegde Sreeleela). ఎందుకంటే ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం మొట్టమొదట పూజ హెగ్డే కి దక్కిందట. అయితే అప్పట్లో రవితేజ కి హిట్స్ లేకపోవడం తో ఈ సినిమా నేను చెయ్యను అని డైరెక్ట్ గానే నిర్మాతకి మొహం మీద చెప్పేసిందట.
దీంతో అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీలీల ని తీసుకున్నారు. ఒకవేళ ఈ చిత్రం పూజా హెగ్డే ఒప్పుకొని సినిమా చేసి ఉంటే, శ్రీలీల కి ఛాన్స్ దక్కేది కాదు. ఈ సినిమా ద్వారా శ్రీలీల తన ప్రతిభ ని చూపించుకోకపోయ్యుంటే ఆమెకి ఈ స్థాయి అవకాశాలు ఆశలు వచ్చేవే కావు. ఈ చిత్రం లేకపోయినా కూడా ఆమెకి అవకాశాలు వచ్చేవి, కానీ మీడియం రేంజ్ హీరోయిన్ గా మాత్రమే స్థిరపడేది,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ అంత తేలికగా వచ్చేది కాదు. అందుకే ‘ధమాకా’ చిత్రం లో హీరోయిన్ ఛాన్స్ ని పూజ హెగ్డే వదులోకోవచడం వల్ల పరోక్షంగా శ్రీలీల కి ఇంత మేలు జరిగిందని అంటున్నారు విశ్లేషకులు.
కానీ ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు పాపం, శ్రీలీల ఎఫెక్ట్ ఈమె మీద చాలా బలంగానే పడింది. రీసెంట్ గానే త్రివిక్రమ్ నటి పూజని లైన్ లో తీసుకువస్తున్నాడు అని, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చాడు అంట. పూజ కూడా ఈ అవకాశాన్ని ఓకే చేసింది, అతి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఆ ప్రకటన వచ్చే వరకు పూజ చేతిలో ఏ సినిమాలు లేనట్టే. సినిమా బృందం అధికారిక ప్రకటన చేసిన తరువాతే మనం లెక్కలోకి తీసుకోవాలి.