ప్రభాస్ అనుష్కల జోడి గురించి ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ మొత్తంలో ఎవ్వరిని అడిగిన టాలీవుడ్ లో బెస్ట్ సెలబ్రిటీ కపుల్ ఎవరని ఆలోచించకుండా చెపుతారు ప్రభాస్ అనుష్క పేరులు. ఎంతో కాలం నుండి రెబెల్ స్టార్ అభిమానులు స్వీటీ (అనుష్క శెట్టి) ని పెళ్లి చేసుకోమని ప్రభాస్ ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. కానీ ప్రభాస్ ఎపుడు వాటిపై స్పందించలేదు.
ఇటీవల ప్రభాస్ చాల ఇంటర్వ్యూలో పాల్గొనటం జరిగింది, వాటిలో అనుష్క తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని తెల్చి చెప్పాడు. అయినా కూడా అభిమానులు ఒప్పుకోవటం లేదు. తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టి పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. దానికి కారణం తను తీసుకునే నిర్ణయాలే అని చెప్పొచ్చు. ఒకపుడు సూపర్ హిట్ సినిమాలు చేసిన అనుష్క ఆ తరువాత సైజు జీరో వంటి సినిమాలు చేసి తప్పు చేసింది.
వేదం సినిమాలో తన పాత్ర కూడా అభిమానులకి నచ్చలేదు. అదేవిధంగా అనుష్క మల్లి డైరెక్టర్ క్రిష్ తో కలిసి ఒక సినిమా చేయబోతుంది అట. ఆ సినిమాలో అనుష్క పాత్ర ఒక వేశ్య, ఈ సినిమాలో అనుష్క చాల అంటే చాల బోల్డ్ గా కనిపించనుంది అట. ఇది తెలిసి అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. మా హీరో ప్రభాస్ పక్కన నిన్ను మేము భార్యగా ఊహించుకుంటుంటే నువ్వు ఇలా చేయటం అస్సలు బాలేదు స్వీటీ అంటూ తెగ మండి పడుతున్నారు.