Home Cinema Prabhas: ప్రభాస్ కి ఆ వీక్నెస్ ఉందా.. రోజు రాత్రికి అది కావాల్సిందేనా..

Prabhas: ప్రభాస్ కి ఆ వీక్నెస్ ఉందా.. రోజు రాత్రికి అది కావాల్సిందేనా..

Prabhas Weakness: ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మొత్తం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. రీసెంట్ గా ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం కూడా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన గత మూడు ఫ్లాప్ చిత్రాలకు వచ్చిన నష్టాలను లెక్క వేస్తే 600 కోట్ల రూపాయిలకు తేలింది. ప్రస్తుతం ఆయన చేతిలో ‘సలార్’,’కల్కి’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

Prabhas-weakness

ప్రభాస్ ఎంతసేపు ఈ భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తాడా? మన తెలుగు ఆడియన్స్ నేటివిటీ కి తగ్గట్టుగా సినిమాలు ఇక చెయ్యడా? అని అభిమానులు అనుకుంటున్న సమయం లో డైరెక్టర్ మారుతీ తో ఒక చిన్న బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా చాలా భాగం పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని పెట్టినట్టు గతం లో రూమర్స్ వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు లేటెస్ట్ గా ‘రాయల్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే మారుతీ చిత్రాలలో హీరోలకు ఎదో ఒక లోపం ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం లో కూడా హీరో ప్రభాస్ కి ఒక లోపం ఉంటుందట(Prabhas Weakness). ఆ లోపం కారణంగా అద్భుతమైన హాస్యం పండుతుందని చెప్తున్నారు. ప్రభాస్ ని ఇంత ఎంటర్టైన్మెంట్ తో కూడిన సబ్జెక్టు లో చూసి చాలా కాలమే అయ్యింది. అప్పుడెప్పుడో ‘బుజ్జిగాడు’ చిత్రం లో కామెడీ పండించాడు. ఆ సినిమా అంటే కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. అలాంటి పాత్రలో ప్రభాస్ కనిపిస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్స్ గా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’ చిత్రాన్ని నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి కొన్ని వర్కింగ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. వాటిల్లో ప్రభాస్ లుక్స్ ని చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు. ఎందుకంటే బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ మళ్ళీ ఆ రేంజ్ లుక్స్ తో ఒక్క సినిమా లో కూడా కనిపించలేదు. ఇది అభిమానుల్లో నెలకొన్న నిరాశ. ఈ చిత్రం తో ఆ కంప్లైంట్ కూడా దూరం అవుతుందని అంటున్నారు మేకర్స్.

Exit mobile version