Home Cinema Prabhas : సాలార్ 2 లో ప్రభాస్ కోసం బారి డైలోగ్స్.. ప్రశాంత్ నీల్ ప్లాన్...

Prabhas : సాలార్ 2 లో ప్రభాస్ కోసం బారి డైలోగ్స్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదుర్స్..

Prabhas : ఏస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఒక ఆల్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాలార్. రెబల స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. మొదటి భాగం హిట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటె మొదటి పార్ట్ లో ప్రభాస్‌కి పెద్దగా డైలాగ్స్ లేవు. అవి అభిమానులను కాస్త నిరాశపరిచాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్ 2లో ప్రభాస్ కోసం పవర్ ఫుల్ లైన్స్ రాశారట. ఈ డైలోగ్స్ ప్రభాస్ నోట వింటే అభిమానులకు గూస్బంప్స్ వచ్చేలా ప్లాన్ చేసారు డైరెక్టర్. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పనులలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అంతే కాదు సాలార్ 2లో ప్రభాస్ కు పెద్ద డైలాగ్స్ ఉన్నాయని, ఇది అతని అభిమానులకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని సమాచారం.

prashanth-neel-planning-major-dialogs-for-prabhas-salaar-2

ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. హోంబుల్ ఫిలిమ్స్ మరో రెండు నెలల్లో సాలార్ 2 షూటింగ్ ప్రారంభించనుంది అని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ చేతిలో ఇదొక్కటే కాదు మరెన్నో పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత స్పిరిట్, రాజాసాబ్ సినిమాలలో ప్రభాస్ కనిపించనున్నాడు.

Exit mobile version