Home Cinema Pushpa 2: లీకైన పుష్ప 2 డైలాగ్.. ఈసారి అల్లు అర్జున్ కొట్టే దెబ్బ మామూలుగా...

Pushpa 2: లీకైన పుష్ప 2 డైలాగ్.. ఈసారి అల్లు అర్జున్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు..

Pushpa 2: టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రూల్’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియో సోషల్ మీడియా ని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ హిట్ గా నిల్చిన ‘పుష్ప: ది రైజ్’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఎంతో పవర్ ఫుల్ గా చూపిస్తున్నాడు(Pushpa 2 Dialouge). ఆయన క్యారక్టర్ ముందు అనుకున్న దానికంటే పవర్ ఫుల్ గా రావాలని సుమారుగా ఏడాది పాటు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని.

pushpa-2-allu-arjun-dialouge

నలుగురు టీం తో ఈ సినిమా కథని ప్రిపేర్ చేసాడు డైరెక్టర్ సుకుమార్. ఇకపోతే ఈ సినిమాలోని డైలాగ్ రీసెంట్ గానే అల్లు అర్జున్ లీక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్, ఆ సినిమా యూనిట్ మొత్తానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసి , ఆ తర్వాత వాళ్ళు కోరిన కోరిక ప్రకారం, ‘పుష్ప : ది రూల్’ నుండి ఒక డైలాగ్ ని లీక్ చేసాడు. ఇక నుండి ఇక్కడ నడిచేది ఒక్కటే రూల్, అది పుష్ప గాడి రూల్ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కి ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో చివర్లో కూడా ఇదే డైలాగ్ ఉంటుంది.’పుష్ప గాడి రూల్’ అంటూ కోపంగా స్టైల్ గా ఆయన చెప్పిన డైలాగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ డైలాగ్ కి ముందు ఈ డైలాగ్ ఉంటుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇక ఈ సినిమా మొత్తం అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాజిల్ మధ్య జరిగే యుద్ధం అని మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆయన పాత్ర కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్.

త్వరలోనే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారట. డిసెంబర్ లోపు షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని టాక్. మనకన్నా నార్త్ లోనే ఈ సినిమా కోసం ఎక్కువాగా వేచిచూస్తున్నారు. సౌత్ లో కన్నా నార్త్ లో రచ్చ లేపింది ఈ సినిమా(Pushpa 2 Dialouge). పుష్ప 2 కి మాత్రం కలెక్షన్ ల బాక్స్ ఆఫీస్ బద్దలు అంటున్నారు అభిమానులు. ఏదిఏమైనా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతే బాగుండు అనుకుంటున్నారు ఫాన్స్.

Exit mobile version