Home Cinema Rajamouli: ఆస్కార్ అవార్డ్స్ ముందు రోజు ఎన్టీఆర్ రామ్ చరణ్ లని రూమ్ కి పిలిచి...

Rajamouli: ఆస్కార్ అవార్డ్స్ ముందు రోజు ఎన్టీఆర్ రామ్ చరణ్ లని రూమ్ కి పిలిచి క్లాస్ పీకిన రాజమౌళి..

Rajamouli: తెలుగు సినిమాకి మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో గర్వించదగ్గ సినిమా గా నిల్చిన RRR చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. టాలెంట్ కి మారుపేరు లాంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కలిసి రాజమౌళి లాంటి డైరెక్టర్ తో మల్టీస్టార్ర్ర్ సినిమా చేస్తే ఎలాంటి అద్భుతాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ అవుతాయని మనం ఊహించామో(Rajamouli Warns Charan Ntr), అంతకు మించే వండర్స్ ని సృష్టించింది ఈ చిత్రం. అసలు ఆస్కార్ అవార్డుని దగ్గర నుండైనా చూస్తామా అని అనుకునే వాళ్ళం అప్పట్లో.

rajamouli-ntr-ram-charan

కానీ ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం, ఇండియా మొత్తం మన వైపు చూసి చప్పట్లు కొట్టడం, ఇలాంటి సంఘటనలను మనం ఎప్పటికీ మరచిపోలేము. ఆ పాటకి ఆ స్థాయి రావడానికి కారణం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మరియు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని అనడం లో ఎలాంటి అతిఆసయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆస్కార్ అవార్డు ఫంక్షన్ జరిగే ముందు రోజు రామ్ చరణ్, ఎన్టీఆర్ ని పిలిచి కొన్ని జాగ్రత్తలు చెప్తూ, చాలా గట్టి వార్నింగ్స్ కూడా ఇచ్చాడట(Rajamouli Warns Charan Ntr).

అదేమిటంటే రేపు ఆస్కార్ అవార్డ్స్ ప్రారంభం అయ్యే గంట ముందే ఇక్కడకి వచ్చేయాలి, హాలీవుడ్ హీరోలు, టెక్నీషియన్స్ కూడా ఆ సమయానికి వచ్చేస్తారు. మనం సమయానికి రాకపోతే మీడియా మనతో ఆడుకుంటుంది, కాబట్టి జాగ్రత్త. ఉదయాన్నే అందరికంటే మనమే ఇక్కడ ఉండేట్టు చూసుకోవాలి అని రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ కి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్నీ రామ్ చరణ్ రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండ మేమిద్దరం పాటించాము అని, రాజమౌళి కంటే ముందుగా మేమే అక్కడకి చేరుకున్నామని రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘దేవర’ కూడా వచ్చే సమ్మర్ లోనే విడుదల అవుతుందని అంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాల నుండి బ్రేక్ తీసుకుని ఇటీవలే పుట్టిన తన పాప తో సమయం గడుపుతున్నాడు.

Exit mobile version