Rajinikanth : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ఎదురుచూస్తున్నారు. తన చివరి సినిమా లియో బారి విజయం తర్వాత ఇప్పుడు రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తన 170వ సినిమా షూటింగ్ లో ఉన్న రజనీ తన 171వ సినిమాని ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్, ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈలోగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ సినిమా టైటిల్ కూలీ. ఈ టీజర్ అభిమానులను మెప్పించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మాస్ లుక్‌లో రజనీని చూసి చాలా రోజులైంది. మంచి కథ దొరికితే రికార్డులు బద్దలవుతాయని చెప్పాలి. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సినిమాలు తీసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు తన దారి మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గోల్డెన్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కనుందని టీజర్ చూశాక తెలిసింది. మూడు నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ యాక్షన్ మూవీగా తెరకెక్కడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
లోకేష్ కనకరాజ్ చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన రజనీతో సినిమా చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని దర్శకుడు లోకేష్ కానగరాజ్ చెప్పారు. లోకేష్ రజినీకి పెద్ద అభిమాని. ఈయన రజిని సినిమాలు ఫస్ట్ రోజే చేసేవాడని తెలిపారు. ఇలాంటి ఛాన్స్ దొరికినందుకు తన హీరో రజిని వేరే లెవెల్ లో చూపిస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు. రజిని ప్రస్తుతం 170 వ సినిమా షూటింగ్లో బిజీ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక కూలి సినిమా షూటింగ్లో పలుగొంటారని తెలుస్తుంది.