Home Cinema Ramya Krishna: ఆ సినీమా సమయంలో ఆ డైరెక్టర్ నన్ను వాడుకున్నాడు..

Ramya Krishna: ఆ సినీమా సమయంలో ఆ డైరెక్టర్ నన్ను వాడుకున్నాడు..

Ramya Krishna Harrased: కేవలం అందాల ఆరబోతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న ఈరోజుల్లో కొంత మంది స్టార్ హీరోయిన్స్ విలక్షణమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో రమ్య కృష్ణ పేరు కచ్చితంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభం నుండి నేటి వరకు ఆమె ఖాళీగా ఇంట్లో కూర్చున్న సంవత్సరమే లేదు. ఇంత బిజీ ఆర్టిస్టుని హీరోయిన్స్ లో మనం ఎక్కడా కూడా చూసి ఉండము. ఇప్పటికీ కూడా ఆమె ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయిలో ఉంది.

ramya-krishna

నేటి జనరేషన్ హీరోయిన్స్ ఈమధ్య తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇది. ఇకపోతే రమ్య కృష్ణ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు చేసింది. ఏ హీరోయిన్ కూడా చేయనటువంటి బోల్డ్ అటెంప్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘నరసింహా’ చిత్రం లో ఆమె చేసిన విలన్ రోల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో రమ్య కృష్ణ విలనిజం చూస్తే ఎలాంటి వారికైనా కోపం వచ్చేస్తుంది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో రమ్య కృష్ణ కూడా ఒకరు. కొన్ని సన్నివేశాల్లో అయితే ఈమె ఏకంగా రజినీకాంత్ ని కూడా డామినేట్ చేసింది.

ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా సౌందర్య నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమెతో జరిగిన ఒక సన్నివేశాన్ని తలచుకొని రమ్య కృష్ణ రీసెంట్ ఇంటర్వ్యూ లో కూడా బాధపడింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు అసలు నరసింహా స్టోరీ చెప్పినప్పుడు, నేను పోషించిన నీలాంబరి పాత్ర ముందుగా అసలు నచ్చలేదు. హీరోయిన్ సౌందర్య పాత్ర బాగా నచ్చింది, ఆ పాత్రనే చెయ్యాలని అనుకున్నాను(Ramya Krishna Harrased). కానీ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ నాతో బలవంతం గా విలన్ పాత్ర ని పోషించేలా చేసాడు. సినిమా విడుదలైన తర్వాత నా పాత్రకి వచ్చిన రెస్పాన్స్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

అయితే ఈ సినిమాలో ఒక్క సన్నివేశం చేసినందుకు మాత్రం ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాను. ఒక సన్నివేశం లో నేను సౌందర్య చెంప మీద నా కాళ్ళు తాకిస్తాను. నాకు ఈ సన్నివేశం చెయ్యడం ఏమాత్రం ఇష్టం లేదు. మనసు చంపుకొని చేశాను, ఈ సన్నివేశం ని తల్చుకుంటే ఇప్పటికీ బాధ వేస్తాది’ అంటూ చెప్పుకొచ్చింది రమ్య కృష్ణ. ఒకపుడు మన తండ్రుల సమయంలో రమ్య కృష్ణ అంటే ప్రతి ఒక్కరి కళల రాకుమారి అలంటి రమ్య కృష్ణ మధ్యలో ఒకేసారి మాయం ఐపోయింది,

మల్లి రాజమౌళి బాహుబలితో కంబ్యాక్ ఇచ్చింది రామి కృష్ణ. అప్పటి నుండి మల్లి రమ్య కృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు, సినిమాల మీద సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి రమ్య కృష్ణ కి.

Exit mobile version