Home Cinema Rana : ఆ హీరోతో రానా మల్టీస్టారర్ సినిమా.. ఫాన్స్ కి పూనకాలే..

Rana : ఆ హీరోతో రానా మల్టీస్టారర్ సినిమా.. ఫాన్స్ కి పూనకాలే..

Rana : దగ్గుబాటి కుటుంబంలో నుండి విక్టరీ వెంకటేష్ తరువాత సురేష్ బాబు తనయుడు రానా (Rana Daggubati Rajashekar Multistarrer) సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. మొద్దట్లో ఈయనకు ఫామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న కూడా ఆయన నటించిన సినిమాలు ఏవి అంత ఆడలేదని చెప్పాలి. రానా కు హీరోగా మంచి పేరు సంపాదించినా సినిమా శేఖర్ కుమ్మలా దర్శకత్వం వహించిన లీడర్ సినిమా అనే చెప్పాలి. ఈ మధ్య రానా అరణ్య, 1945 మరియు విరాట పర్వం అనే సినిమాలు చేసాడు.

rana-daggubati-multistarrer-with-senior-hero-rajashekar-directed-by-teja

ఈ అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నిజం చెప్పాలంటే రానాకు మల్టీ స్టార్రర్ సినిమాలే వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇటీవల, రానా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన బీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది మరియు ఇద్దరి అభిమానులంకు మంచి ఫీస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే, రానా దగ్గుబాటి మల్లి ఇంకో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

రానా ప్రభాస్ కలిసి నటించిన బాహుబలి రెండు పార్టీలు బారి విజయం సాధించింది. ఇలా రానా మల్టీ స్టార్రర్ సినిమాలే ఆయనకు మంచి పేరు సంపాదించి పెడుతుంది అని ఆయన కూడా అనుకోని ఉంటారు. అయితే రాబోయే మల్టీ స్టార్రర్ సినిమా ఎవరితోనో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి తెలుసుకుందాం. రానా రాబోయే సినిమాకు సీనియర్ నటుడు రాజశేఖర్ తో కలిసి మల్టీ స్టార్రర్ తీస్తున్నారు మరియు ఈ సినిమాను డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కాంబినేషన్ సరికొత్తగా ఉంది మరియు సినిమా జనాలకు ఇంటరెస్టింగ్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. గతంలో డైరెక్టర్ తేజ మరియు రానా కాంబినేషన్ లో నేను రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించి డైరెక్టర్ తేజకు చాలా సంవత్సరాల తరువాత హిట్ రుచి చూసాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించింది.

ఇప్పుడు మల్లి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే రానా అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఈ సినిమా పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు మరియు అభిమానులు ఏంటో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రాజశేఖర్ కు కూడా సరైన హిట్ లేక విలవిలా లాడిపోతున్నాడు. ఈ సినిమా అయినా ఇద్దరికీ మంచి హిట్ తెచ్చిపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. (Rana Daggubati Rajashekar Multistarrer)

Exit mobile version