Home Cinema Rana : సమంత పై సంచలన వ్యాఖ్యలు చేసిన రానా.. సోషల్ మీడియాలో వైరల్..

Rana : సమంత పై సంచలన వ్యాఖ్యలు చేసిన రానా.. సోషల్ మీడియాలో వైరల్..

Rana : ఇండస్ట్రీలోకి రాకముందు దగ్గుబాటి రానా దాదాపు 70 సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగ్గంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన శేఖర్ కములా దర్శకత్వం వహించిన లీడర్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ దగ్గుబాటి రానా ఒకప్పుడు సమంతతో చాలా రిలేషన్ షిప్ మైంటైన్ చేసేవాడు. దగ్గుబాటి రానా మేనత్త మరియు నాగార్జున మొదటి భార్య లక్ష్మి కొడుకు నాగ చైతన్య. ఆయన భార్య సమంత. అలా నాగ చైతన్యకి రానా వరుసకు బావమరిది అవుతాడు. ఇలా సమంత రానాకు చెల్లెలు వరుస అవుతుంది.

వీరిద్దరికి మంచి స్నేహపూర్వకంగా సంబంధం కలిగి ఉంది. అయితే ఇప్పుడు సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ సంబంధం కాస్త చెడిపోయిందనే చెప్పాలి. అయితే రానా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో రానాను సమంత గురించి అడిగారు. అయితే రానా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు, క్విక్ క్వశ్చన్స్‌లో భాగంగా సమంత గురించి హోస్ట్ ఒక ప్రశ్న అడిగారు.

rana-daggubati-sensational-comments-on-samantha

సమంత దగ్గర చాలా సమాచారం ఉంది. మీరు ఆమె నుండి కొంత సమాచారాన్ని పొందవచ్చు. ఇంకా ఆయన పొడిగిస్తూ మీరు ఆమెతో మూడు నుండి నాలుగు గంటలు సరదాగా మాట్లాడవచ్చు. సమంత మీరు ఎంత సోది చెప్పిన వింటూనే ఉంటుంది అని రానా అన్నారు.ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన సమంత అభిమానులు రానా ఏంటి ఇంత మాట అన్నాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version