Regina Cassandra: టాలీవుడ్ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ని చూడలేకపోయిన హీరోయిన్స్ లో ఒకరు రెజీనా కాసాండ్రా. ఈమె మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరో గా నటించిన ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా రెజీనా కి టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది(Regina Cassandra Casting Couch). ఇక ఆ తర్వాత వరుసగా కుర్ర హీరోలతో సినిమాలు చేసి అడపాదడపా పలు హిట్స్ అందుకున్న రెజీనా కాసాండ్రా, కొత్త హీరోయిన్స్ రాకతో హీరోయిన్ గా అవకాశాలు మెల్లిగా తగ్గుతూ వచ్చాయి.
దీనితో ఆమె విలన్ రోల్స్ కూడా చెయ్యాల్సి వచ్చింది. ‘క్షణం’, ‘చక్ర’ మరియు ‘7’ వంటి చిత్రాలలో ఈమె పోషించిన విలన్ రోల్స్ కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కేవలం విలన్ రోల్స్ మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది రెజినా కాసాండ్రా. ఇదంతా పక్కన పెడితే రెజినా కాసాండ్రా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కెరీర్ ప్రారంభం లో తనకి ఎదురైనా కొన్ని చేదు జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చానని, అవకాశాల కోసం ప్రతీ ఒక్కరిని ఎంతో బ్రతిమిలాడుకున్నానని చెప్పుకొచ్చింది.
అయితే ఒక రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అడ్జస్ట్మెంట్ ఇస్తే రేపటి నుండే నిన్ను షూటింగ్ లో పాల్గొనేలా చేస్తాను అన్నాడట(Regina Cassandra Casting Couch). సినిమా అన్న తర్వాత రెమ్యూనరేషన్ విషయం లో అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటారు కదా, దాని గురించేమో అని అనుకుందట రెజీనా. అయితే ఇదే విషయాన్ని తన వ్యక్తిగత అసిస్టెంట్ ని అడగగా, అడ్జస్ట్మెంట్ అనే పదానికి మీనింగ్ చెప్పగానే రెజీనా కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యిందట. ఇక ఆ తర్వాత నుండి ఆమె ఆ వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్స్ ని ఎత్తుకోవడం మానేసింది.
ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురు అయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది రెజీనా కాసాండ్రా. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఈమె బోర్డర్, ఫ్లాష్ బ్యాక్ మరియు సూర్పనగై వంటి మూడు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. రెజినా రెండు తెలుగు రెండు తమిళ్ సినిమాలల్లో నటిస్తుంది. ఈ సినిమాలు అన్ని ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతున్నాయి. మంచి అందం, నటనా ఉన్నపటికీ రెజినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. మరి హీరోయిన్ అంటేనే అంత, ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రానివ్వలేరు. చాల కొద్దీ మంది హీరోయిన్ లకి మాత్రమే ఇది సాధ్యం. రెజినా వి ఆ నాలుగు సినిమాలు హిట్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాము.