Home Cinema Renu Desai : అకిరా నందన్ డెబ్యూ సినిమాపై ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.....

Renu Desai : అకిరా నందన్ డెబ్యూ సినిమాపై ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.. అదేంటంటే..?

Renu Desai : ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జనరేషన్ వారికి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే తెలుసు. కానీ రేణు 90’s లో ఉన్న వారికి ఓ హీరోయిన్ మరియు ఫాషన్ మోడల్ గా తెలుసు. ఈమె మోడలింగ్ చేస్తున్న సమయంలో ఓ సినిమా ఆఫర్ రేణుకు లభించింది. ఈమె(Akira Nandan Debut Cinema) డైరెక్టర్ చెప్పిన కథ విని బావుంది నేను చేస్తా అని చెప్పింది. ఆ సినిమా మరెంటో కాదు, పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన బద్రి సినిమా. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్ గా వెండితెరకు పరిచమైంది.

renu-desai-gave-clarity-about-akira-nandan-debut-movie

ఈ సినిమా అప్పట్లో బారి విజయం సాధించింది మరియు పవన్ కళ్యాణ్ ను యువతకు దెగ్గర చేసి స్టార్ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. రేణు దేశాయ్ కూడా మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ లెవెల్ కు వెళ్ళింది. రేణు కు హీరోయిన్ గా వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. బద్రి సినిమా తరువాత ఈ అమ్మడుకు ఒక్క మంచి హిట్ దక్కలేదు అనే చెప్పుకోవాలి. అయితే రేణు దేశాయ్ తన హిట్ హీరో పవన్ కళ్యాణ్ తో కలిసి జానీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బారి డిసాస్టర్ గా నిలిచింది. కానీ ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ మధ్యలో ప్రేమ చిగురించింది.

వీరు కొన్ని సంవత్సరాలు కలిసి తిరిగాక మరియు పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని తో విడాకులు అయ్యాక రేణు దేశాయ్ ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా లభించారు. ఇలా కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాక వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తరువాత పవన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటె రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తరువాత మల్లి వెండితెర మీద కనపడబోతుంది. ఈమె రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తుంది.

ఈ సినిమా దసరా కానుకగా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ భాగంగా రేణు దేశాయ్ కొన్ని ఇంటర్వ్యూలలో పాలుగొన్నది. అయితే ఓ ఇంటర్వ్యూయర్ ఆమె ను ఆమె కొడుకు అకిరా నందన్ సినిమాలోకి ఎప్పుడు వస్తున్నాడు అని అడ్డగా ఆమె సంచలనం నిర్ణయం చెప్పింది. అకిరా ప్రస్తుతం మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేస్తున్నాడని ఆమె చెప్పారు మరియు

అకీరాకు నటన రంగంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చారు. అకిరా(Akira Nandan Debut Cinema) ను నేను కానీ తన తండ్రి పవన్ కళ్యాణ్ కానీ ఫోర్స్ కూడా చేయడం లేదని చెప్పింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version