Home Cinema Ramayana : రణబీర్ – సాయి పల్లవి రామాయణ సెట్స్ నుండి ఫోటోలు లీక్..

Ramayana : రణబీర్ – సాయి పల్లవి రామాయణ సెట్స్ నుండి ఫోటోలు లీక్..

Ramayana : ఈ రోజు బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాలలో ఒకటి దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం. ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణబీర్ కపూర్ మరియు సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ ప్రత్యేక కాంబినేషన్‌పై చాలా ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ చిత్రం గురించి అకస్మాత్తుగా లీకులు వెలువడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల, ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది మరియు ఈ సమయంలో సాయి పల్లవి మరియు రణబీర్ల ఫోటోలు సెట్ నుండి ఇంటర్నెట్ లోకి వచ్చాయి.

ఈ సినిమాపై అందరు ఆసక్తిగా ఉండడంతో ఈ ఫోటోలు బాలీవుడ్ అభిమానుల్లో వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో కన్నడ రాక్ స్టార్ యష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గ్యాప్‌లో ఒక్కసారిగా ఈ చిత్రాలు లీక్ కావడం ఆశ్చర్యం కలిగించింది. రణబీర్ ఇటీవల యానిమల్ చిత్రంతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామాయణ పైన తన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

sai-pallavi-ranbir-kapoor-photos-leaked-from-ramayana-sets

ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కూడా బారి విజయం సాధించాలని కోరుకుంటున్నారు రణబీర్ అభిమానులు. ఈ ఫోటోలలో సాయి పల్లవి మరియు రణబీర్ జంట చాలా చూడముచ్చటగా ఉంది. రామాయణ సినిమా ఇప్పటికే బాలీవుడ్ లో బారి బజ్ ను క్రియేట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో సినిమాకు సంబందించిన మెయిన్ క్యారక్టర్ ఫోటోస్ లీక్ అవ్వడం ఇండస్ట్రీలో సహజమే అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version