టాలీవుడ్ ఇండిస్ట్రీలో ఉన్న జంటలలో క్రౌడ్ ఫేవరేట్ జంట అంటే సమంత మరియు నాగచైతన్య జంట. వీరి జంటకు ఎందరో అభిమానులు కూడా అయిపోయారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకొని, కొద్దీ సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఈ న్యూస్ అప్పట్లో వీరి అభిమానులను బాధింపజేసింది. వీరు విడాకులు (Samantha Naga Chaitanya Divorce) తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. వీరి విడాకులకు కారణం ఇది అది అంటూ ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.
సమంత కు పిల్లలు పుట్టారు అందుకే నాగచైతన్య విడాకులు ఇచ్చాడు అంటూ కొందరు ఆకతాయిలు పుకార్లు లేపారు. అయితే సమంత వీటన్నిటిని ఎదురుకొని తన పని తానూ చేసుకుంటూ పోతుంది. ఇటీవల సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ చేసింది. సామ్ తన స్నేహితురాలితో దిగిన ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, నా లైఫ్ లో నేను తీసుకున్న మంచి డెసిషన్స్ కు పేస్ పెడితే అది మేఘన వినోద్ అంటూ కాప్షన్ కూడా రాసింది.
ఈ పోస్ట్ చూసిన వారు అంత ఈమె వల్లే మీరు నాగచైతన్యకు విడాకులు ఇచ్చారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. వీరు (Samantha Naga Chaitanya Divorce) విడాకులు తీసుకున్న కొన్ని సంవత్సరాలకు ఈ వార్తా బయటపెట్టింది నటి. సమంత ప్రస్తుతం సినిమాలలో నటించడంతో పాటు తమిళ్ లో ర్యాప్ షోను మొదలుపెటింది మరియు తన పనిలో బిజీ బిజీ అయిపొయింది. సమంత చివరిగా తేరా మీద కనిపించిన సినిమా విజయ్ దేవరకొండ ఖుషి.