Samyuktha Menon : టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి రీసెంట్ గా అడుగుపెట్టిన కొంత మంది హీరోయిన్స్ లో అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా లో రానా కి జోడిగా నటించి మంచి గుర్తింపుని దక్కించుకున్న సంయుక్త మీనన్, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఈమె స్టార్ డైరెక్టర్ల దృష్టిలో పడింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘భింబిసారా’ , ‘సార్’ మరియు ‘విరూపాక్ష’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో సంయుక్త మీనన్ కి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే పేరు వచ్చింది.
దర్శక నిర్మాతలు కూడా ఈమెని తమ సినిమాలలో హీరోయిన్ గా తీసుకుంటే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ని చాలా బలంగా నమ్ముతున్నారు. అయితే ఈమె ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి సన్నిహితంగా మెలుగుతుంది అని ఇండస్ట్రీ లో గత కొంత కాలం నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ పుకార్లు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ వరకు పాకడం తో అక్కడ సంయుక్త మీనన్ పరువు మొత్తం పోయిండట. దీనితో ఇప్పుడు ఈమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
అదేమిటంటే ఇక నుండి త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలలో కాని, ఆయనకీ సంబంధించిన నిర్మాణ సంస్థలలో నటించడం కాని చెయ్యకూడదని నిర్ణయించుకుందట. గత కొంత కాలం క్రితమే ఈమె త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా చెయ్యడానికి ఒప్పుకుందని వార్తలు వినిపించాయి. అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసిందట. కానీ ఇప్పుడు ఆ సినిమా నుండి తప్పుకోవడానికి ఆలోచిస్తుంది సంయుక్త మీనన్, ఆమె నుండి సరిగా రెస్పాన్స్ రాకపోవడం వల్లనే మొన్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ ని ప్రకటించిన రోజు సంయుక్త మీనన్ పేరు చెప్పకుండా హోల్డ్ లో ఉంచారని సమాచారం.
త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సంయుక్త (Samyuktha Menon) ఇలా రివర్స్ అయితే టాలీవుడ్ లో ఆమె కెరీర్ సాఫీగా సాగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే త్రివిక్రమ్ తో ప్రతీ ఒక్కరికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒక్కసారి ఈ అమ్మాయితో సినిమాలు చెయ్యొద్దు అంటే ఎవ్వరూ చెయ్యరు. మరి అలాంటి పరిస్థితి సంయుక్త కొని తెచ్చుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.