Home Cinema Pooja Hegde: మహేష్ సినిమా నుండి పూజ హెగ్డేను తొలిగించడానికి కారణం ఆ హీరోయిన్ ఏనా..

Pooja Hegde: మహేష్ సినిమా నుండి పూజ హెగ్డేను తొలిగించడానికి కారణం ఆ హీరోయిన్ ఏనా..

Pooja Hegde: పూజ హెగ్డే, టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్లలో ఒక్కరు. నటి పూజకు తెలుగులో వరుస హిట్లతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే నటి ప్రస్తుతం త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అప్డేట్ వచినప్పటి నుండి ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్లుగా పూజ హెగ్డే మరియు శ్రీలీల లను అనుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్. కానీ ఇప్పుడు మొదటి హీరోయినిగా పూజను తీసేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

పూజ బదులుగా మహేష్ గుంటూరు కారంలో మొదటి హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను అనుకుంటున్నారట. దీనికి గల కారణం, సంయుక్త పై దర్శకుడు త్రివిక్రమ్ కన్నేసారని ఓ వార్త వైరల్ అవ్వుతుంది. ఇదిలా ఉంటె.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తొలిగించారని టాలీవుడ్ లో న్యూస్ చెక్కర్లుకొడుతుంది. అయితే ఈ వార్త మీద చిత్ర యూనిట్ స్పందించింది. మహేష్ గుంటూరు కారంలో మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసేశామన్న వార్త అబధం.

ఇలాంటి వార్తాలు నమ్మవద్దని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ వార్తా మీద స్పందించిన టీమ్ హీరోయిన్ పూజ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే, పూజ నిజంగానే ఈ సినిమా నుండి తప్పుకుందా అనేది తెలవాలి. దర్శకుడు త్రివిక్రమ్ కు మరియు సంయుక్త మీనన్ మధ్యలో ఎదో సంబంధం ఉందని పుక్కర్లు వచ్చాయి. దీని మీద ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అది నిజమేనని ప్రేక్షకులు అంటున్నారు. వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం వలెనే పూజ హెగ్డేను తీసేశారని మీడియా కోడై కూస్తుంది.

నటన పరంగా సంయుక్తకు మంచి పేరే ఉంది మరియు తాను నటించిన సినిమాలు అన్ని బారి విజయం సాధించాయి. ఇటీవల పూజ హెగ్డే చేసిన సినిమాలు అని బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం అయ్యాయి.

దీనికి గాను మహేష్ తన సినిమాలో హీరోయిన్ గా వేరే వాళ్ళని పెట్టమని దర్శకుడిని కోరారు అని కొందరు అంటున్నారు. వీటిన్నిటిలో ఏది నమ్మాలో ఏది నమ్మొదో కూడా తెలియడం లేదు. ఈ విషయంపై చిత్ర యూనిట్ యొక్క ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వేచిచూడాలి. ఏది ఏమయినా దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబుకు హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

Exit mobile version