Home Cinema Revathi : కాస్టింగ్ కౌచ్ సమస్యలపై స్పందించిన సీనియర్ హీరోయిన్ రేవతి.. అప్పటికంటే ఇప్పుడే ఎక్కువైంది...

Revathi : కాస్టింగ్ కౌచ్ సమస్యలపై స్పందించిన సీనియర్ హీరోయిన్ రేవతి.. అప్పటికంటే ఇప్పుడే ఎక్కువైంది అంటూ కామెంట్స్..

Revathi : సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే నటీనటులుగా వెళ్లి, మన టైం బాగుంటే మంచి పేరుతో పాటు ఫుల్ డబ్బును కూడా సంపాదించుకోవచ్చు అనుకుంటారు కొందరు. కానీ సినిమా రంగంలో పనిచేసేవారు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో ఎవరు ఊహించలేరు. మరి ముక్యంగా హీరోయిన్ల అవసరాన్ని అవకాశంగా తీసుకునే వారు ఈ ఇండస్ట్రీలో బోలెడంత మందే ఉంటారు. యువతులు(Senior Actress Revathi) నటన మీద ఉన్న ఇష్టంతో హీరోయిన్లు గా ట్రై చేదాం అని అనుకుంటారు.

senior-actress-revathi-comments-about-casting-couch-problems-in-cinema-industry-these-days

వీరికి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేక హీరోయిన్ గా ఎలా సినిమా ఛాన్సులు దక్కించుకోవాలో తెలీదు. ఇలాంటి అందమైన యువతిలు ఆడిషన్స్ కు ఎప్పుడు వస్తారా అని కొందరు రాబందులు ఎదురు చూస్తుంటారు. ఇలా వారు తమ వద్దకు సినిమా ఆఫర్ల కోసం ఎవరైనా అమ్మాయిలు వస్తే తమకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలంటే తమ కోరిక తీర్చాలని డైరెక్ట్ గా మొఖం మీదే అడుగుతారు. కొంత మంది యువతిలు ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా సరే తమ ప్యాషన్ తో హీరోయిన్లు అవుదాం అని ఇంట్లో నుండి వచ్చేసిన వారు ఉంటారు.

ఇలాంటి సిట్యుయేషన్స్ లో కొందరు ఎలాంటి దారి లేకపోవడంతో వారు అడిగిన కోరిక తీరుస్తారు. కానీ కొంత మందిని నువ్వు హీరోయిన్ కు పనికి రావు అని వాడుకొని మోసం చేసిన వాలు కూడా ఉంటారు. ఇలా ఎంతో మంది క్యాస్టింగ్ కౌచ్ భారన పడ్డారు మరియు కొంత మంది అయితే మీడియా ముందుకు వచ్చి వారిని వాడుకొని వదిలేసినా వారి పేర్లు కూడా చెప్పారు. ఇదిలా ఉంటె మీ అందరికి సీనియర్ నటి రేవతి సుపరిచితురాలే. ఈమె ఇటీవల కాస్టింగ్ కౌచ్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

కాస్టింగ్ కౌచ్ సమస్యలు మా అప్పటినుండి ఈ సినిమా ఇండస్ట్రీను పిశాచిలా పీక్కుతింటుంది. అయితే ఇలా చేయడం మా కాలంలో చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇది చాలా సులభం అయిపొయింది. దీనికి కారణం ఏంటంటే, స్మార్ట్ ఫోన్లు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. రేవతి (Senior Actress Revathi)కాలంలో ఎవరినైనా తమ కోరిక తీర్చమని అడగాలంటే, డైరెక్ట్ గా అడగాలి.

ఇలా అడగాలంటే అందరికి దర్యం ఉండదు. కానీ ఇటీవల కాలం లో మొబైల్ ఫోన్ నుండి ఒక మెసేజ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు పెరిగిపోతున్నాయి అని ఆమె అన్నారు.

Exit mobile version