Home Cinema Sridevi-Janhvi: అపుడు తల్లి ఇప్పుడు కూతురు.. ఎందుకు ఇలా చేస్తున్నారు..

Sridevi-Janhvi: అపుడు తల్లి ఇప్పుడు కూతురు.. ఎందుకు ఇలా చేస్తున్నారు..

sridevi-janhvi-kapoor

Sridevi-Janhvi: టాలీవుడే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో తనకుంటూ ఒక ముద్ర వేసుకున్న హీరోయిన్ శ్రీదేవి. ప్రస్తుతం ఆమె మరణించింది కానీ, ఆమె బతికి ఉన్నట్లయితే ‘ఇంగ్లిష్-వింగ్లిష్’లో కనిపించినట్లగానే సినిమాలు, వెబ్ సిరీస్ లలో బాగా బిజీగా ఉండేదని సినీ విశ్లేషకులు ఆమె టాపిక్ వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటారు. ఎవర్ గ్రీన్ హీరోయిన్ అంటే సావిత్రీ తర్వాత శ్రీదేవని ఘంటాపతంగా చెప్పవచ్చు. సావిత్రీ ఒక తెలుగు, తమిళంలో మాత్రమే ఎక్కువగా నటించింది. కానీ శ్రీదేవి బాలీవుడ్ వరకు వెళ్లింది.

sridevi-janhvi-kapoor

అప్పట్లో హాలీవుడ్ సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ వచ్చిందన్న రూమర్లు బాగా వినిపించాయి. కానీ ఇవన్నీ పుకార్లే అని ‘రాఘవేందర్ రావు సౌందర్య లహరి’లో కొట్టి పారేసింది. ఆమె మరణించిన తర్వాత ఆమె కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బతికి ఉన్న సమయంలో ఎక్కువగా తన కూతురు లైఫ్ గురించే ఆలోచించేది శ్రీదేవి(Sridevi Janhvi). జాన్వీ కపూర్ ను ఇండస్ట్రీలో ఎలా స్టార్ హీరోయిన్ ను చేయాలని పరితపించేది. ఆమె బతికి ఉన్నంత వరకు ఆమె కల నెరవేరలేదు. ఆ తర్వాత జాన్వీ ఇండస్ట్రీలోకి వచ్చినా పెద్దగా హిట్ ఉన్న సినిమాలు మాత్రం చేయలేదు. ఎంతో కొంత గ్లామర్ పరంగా నెట్టుకస్తుంది.

sridevi

ఆమె లేడీఓరియంటెడ్ గా 2 సినిమాలు చేసినా అవి పెద్దగా ప్రేక్షకులకు ఎక్కేలేదు. దీంతో ఆమె నటనకు ట్రాక్ రికార్డ్ లేకుండా పోయింది. అందుకు కారణం కూడా ఇప్పుడు సోషల్ మీడయాలో గుప్పుమంటుంది. ఆమె తల్లి (శ్రీదేవి) చేసిన తప్పునే జాన్వీ కూడా చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. తన క్యారెక్టర్ హైలెట్ అయ్యేలా స్క్రిప్ట్ ను మార్చాలని గతంలో శ్రీదేవి డైరెక్టర్లను కోరేవారట. అయితే, జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు అదే చేస్తుందని వినికిడి. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో తీస్తున్న సినిమా #NTR 30. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు ఆమెకు స్టోరీని చెప్పాడట.

janhvi-kapoor

అయితే స్టోరీ మొత్తం విన్న జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కన్నా తనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేలా మార్చాలని కోరిందట. అయితే చిరంజీవితో గతంలో ఒక సినిమా సందర్భంలో కూడా శ్రీదేవి ఇలానే కోరిందట. జాన్వీ కపూర్ అభ్యర్థనను కొరటాల తిరస్కరించాడట. ప్రస్తుతం టాలీవుడే కాకుండా హాలీవుడ్ వరకు క్రేజ్ ఉన్న హీరో ఎన్టీఆర్ ఆయన రోల్ తగ్గించడమేంటని ప్రశ్నించాడట. అయితే కొద్దిగా మార్పులు చేసి జాన్వీ కపూర్ కు కూడా మంచి హోప్ ఉన్న పాత్రగా డిజైన్ చేశారట. ఈ సినిమాతో జాన్వీ డైరెక్ట్ తెలుగు ఆఫర్ పట్టేసింది. ఇది హిట్ అయితే ఆమెకు మార్కెట్ పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.