Home Cinema Honey Rose : హనీరోజ్ ను డైరెక్ట్ గా అది చూపించాల్సిందే అన్న డైరెక్టర్..

Honey Rose : హనీరోజ్ ను డైరెక్ట్ గా అది చూపించాల్సిందే అన్న డైరెక్టర్..

Honey Rose : సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ అందం ఒక్కటే సరిపోదు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. మరి ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పడం కష్టం. కొందరు చేసిన ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్లు అవుతుంటారు. మరికొందరికి ఎన్ని సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాదు. మరి కొందరికైతే సినిమాలు చేసి మానేసి చాలా కాలం తర్వాత మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టాక స్టార్ డమ్ వస్తుంటుంది(Director Asked Honey Rose). ప్రస్తుతం ఈ కోవలోకే చేరుతారు హనీరోజ్. అప్పుడెప్పుడో ఆలయం సినిమాలో శివాజీ సరసన టాలీవుడ్ కు పరిచయం అయింది హనీరోజ్. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు.

honey-rose

దీంతో తెలుగును వదిలి తన మాతృభాష మలయాళంలోనే సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్ అయింది. దీంతో టాలీవుడ్ దాదాపు హనీ రోజ్ ను పూర్తిగా మర్చిపోయింది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత నటసింహం బాలకృష్ణ సరసన నటించి ప్రస్తుతం తెలుగులో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉన్నా పలు ఫోటోషూట్స్, షాప్ ఓపెనింగ్, ఈవెంట్స్ కి వెళ్తూ దండిగా రెండు చేతులా డబ్బులు సంపాదిస్తుంది. అయితే హనీ రోజ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.

హనీరోజ్ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే క్రమంంలో ఓ తెలుగు డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టాడట(Director Asked Honey Rose). ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ అయింది. ఆ దర్శకుడు మరెవరో కాదు వీరసింహారెడ్డిని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని. నిజానికి ఆ సినిమాలో గోపీచంద్. బాలకృష్ణ మరదలి పాత్రకు చాలా మంది హీరోయిన్లను అనుకున్నారట. కానీ స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఆ పాత్రకు తగ్గట్లు సూట్ కాలేదట. దీంతో కొత్త అందం అయితే బాగుంటుందని భావించారట. ఇలా ట్రై చేస్తున్న క్రమంలోనే ఆయనకు హనీ రోజ్ తారసపడిందట. తొలుత ఆమెను పిలిచించి ఆడిషన్ తీసుకున్నారట. కానీ అప్పుడు ఓకే ఓకేగా అనిపించిందట.

అందుకే వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యాక హనీ రోజ్ లో మాస్ ఎలివెంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారట. మరి బాలయ్య సరసన హీరోయిన్ అంటే మాస్ యాంగిల్ కంపల్సరి. అందుకే ఆమె వద్ద నుంచి మాస్ యాంగిల్ కావాలని మళ్లీ హనీరోజ్ నుంచి ఆడిషన్ తీసుకున్నారట. అయితే హనీ రోజ్ కు చాలా సింపుల్ కూల్ అండ్ క్లాసికల్ పాత్రలంటే ఇష్టమని తెలిపిందట. మాస్ లుక్ మాస్ బీట్స్ పెద్దగా లైక్ చేయనంటూ గోపీచంద్ కు చెప్పిందట.

అయినా బలవంతంగా గోపీచంద్ మల్లినేని.. ఆమెను మాస్ యాంగిల్ ఫుల్ గా ఉన్నా మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్లో డ్యాన్స్ చేయించి అప్పట్లో వార్తలో నిలిచాడు. సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్ర హనీ రోజ్ కు బాగా కలిసి వచ్చింది. ఈ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.

Exit mobile version