Friday, September 20, 2024
HomeCinemaTamannaah: ఈ ఫొటో లో బ్యాక్ చూపిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా..?

Tamannaah: ఈ ఫొటో లో బ్యాక్ చూపిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా..?

Tamannaah: సోషల్ మీడియా లో నిన్నటి నుండి ఈ ఫొటో తెగ హల్చల్ చేస్తుంది. ఇందులో కనిపిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. పోనీ ఆ ఫొటోలో కనిపిస్తున్న ఆ హాట్ బ్యూటీ ఎవరో కనిపెట్టగలరా.? ఈమె తెలుగు సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో తమిళం లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా చేసిన సినిమాలన్నీ డమాల్(Tamannaah Back). ఇక ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి, గ్రాండ్ హిట్ అందుకొని, ఇండస్ట్రీ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

tamannaah-back

ఆ తర్వాత ఈమె టాలీవుడ్, కోలివుడ్ లలో దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన నటించి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా నిల్చింది. పాలరాతి శిల్పం లాంటి అందం, అద్భుతమైన నటన, మెరుపు తీగ లాంటి డ్యాన్స్ అనే సొంతం. ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత ఆమె ఎవరో ఈ పాటికి మీకు అర్థం అయిపోయి ఉండాలి. ఆమె మరెవరో కాదు తమన్నా. ఈమధ్య తమన్నా సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముద్దు సన్నివేశల్లో నటించడానికి ఏమాత్రం ఇష్టం చూపని తమన్నా, బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ముద్దు సన్నివేశాలు ఉన్న తప్ప కంటెంట్ ఉన్న చిత్రాలను చెయ్యడం మానేసింది.

actress-tamannaah

రీసెంట్ గా విడుదలైన ‘జీకర్ద’, ‘లస్ట్ స్టోరీస్2’ చిత్రాలు అందుకు ఉదాహరణ. ఈ రెండు సినిమాల్లో ఆమె చేసిన రొమాన్స్ టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా ఇప్పటి వరకు చెయ్యలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు(Tamannaah Back). ఆ రేంజ్ లో చేసింది. అందుకే ఇప్పుడు తమన్నా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా నటించిన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోయిన్ జైలర్ చిత్రాలు ఆగష్టు 11, 12 తేదీలలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఆమెకి సక్సెస్ ని ఇస్తాయో లేదో చూడాలి.

tamannaah-bhatia

తమన్నా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులే అయ్యింది. ఈమధ్య ఎక్కువగా ఆమె ఓటీటీ కి పరిమితం అయ్యింది. తెలుగు లో ఆమె చివరిసారిగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో తమన్నా విలన్ గా నటించింది. ఆమె విలనిజం చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. భవిష్యత్తు లో కూడా ఆమె ఇలాంటి విలన్ రోల్స్ చెయ్యడానికి సిద్ధం అని అంటుంది. చూడాలి మరి తమన్నా మళ్ళీ నార్మల్ సినిమాలు చేస్తుందో లేదా ఇలాంటి బోల్డ్ సినిమాలకే అంకితం అవుతుందో. ఫాన్స్ మాత్రం ఇలాంటి సినిమాలే చేసి మాకు నేత్రా నందం ఇవ్వాలి అని కోరుకుంటున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts