Home Cinema Tamannah : భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కు తమన్నా షాక్ ఇవ్వనుందా.. పెళ్లి తనతో...

Tamannah : భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కు తమన్నా షాక్ ఇవ్వనుందా.. పెళ్లి తనతో కాదా..?

Tamannah : లవ్ ట్రాక్స్ సినీ ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఆ క్రమంలో ప్రేమ జంటలు ఎంజాయ్ చేయడం ఫారిన్ కు చెక్కేయడం చాలా కామన్. సౌత్ ఇండస్ట్రీలో మిల్కీ(Tamannah Vijay Verma) బ్యూటీగా పేరు తెచ్చుకని స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తుంది తమన్నా భాటియా. హ్యాపీడేస్ సినిమాతో తెలుగు యువత గుండెల్లో చిచ్చు పెట్టిన చిన్నది ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో తెగ బిజీగా ఉంది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీసులతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది.

tamannah-said-she-will-not-marry-her-vijay-verma

ఇదే కాకుండా ఆఖరి సచ్ అనే మరో వెబ్ సిరీస్‍తోనూ సందడి చేస్తోంది. అలాగే గ‌త నెల‌లో త‌మ‌న్నా నుంచి ఒక రోజు తేడాతో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి. అందులో భోళా శంక‌ర్ ఒక‌టి కాగా.. మ‌రొక‌టి జైల‌ర్‌. వీటిలో జైల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారి జాబితాలో తమన్నా ఒకరు. ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ తో యావత్ దేశాన్ని తన గ్లామర్ తో హీటెక్కించింది.

ఆ వెబ్ సీరీస్ లో నటించి విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు మీడియా సాక్షిగా ప్రకటించింది. ఈ సంవత్సరం న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను విజ‌య్ వ‌ర్మ, త‌మ‌న్నా చాలా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వారి మధ్య ఉన్న ల‌వ్ ఎఫైర్ వార్తలు ఊపందుకున్నాయి. కొన్నాళ్ల తర్వాత ఆ వార్తలన్నింటినీ నిజం చేస్తూ విజయ్ వర్మ తమన్నా తమ మధ్య ఉన్న బంధాన్ని కన్పార్మ్ చేశారు.

అలాగే వారికి కాస్తంత ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుని ఎంజాయ్ చేసేందుకు వెకేషన్ కు వెళ్తున్నారు. ఇటీవల వారిద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లి వచ్చారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది విన్న అభిమానులంతా విజయ్ వర్మను తమన్నా(Tamannah Vijay Verma) యూజ్ అండ్ త్రో గా వాడేసుకుంటుందా అన్న కామెంట్లు చేస్తున్నారు. అదేంటంటే.. విజ‌య్ వ‌ర్మను త‌మ‌న్నా పెళ్లి చేసుకోద‌ట‌.

పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. పెళ్లి ఉద్దేశం తనకు లేదంటూ ట్విస్ట్ ఇస్తోంది. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో విజ‌య్ వర్మతో ప్రేమ‌లో ప‌డ్డాను. అతడు అన్ని విధాలా త‌న‌కు రక్షణగా ఉంటాడనే నమ్మకం కుదిరింది. అందుకే ఇష్టపడ్డాను అని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది. అలాగే వివాహ వ్యవస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం తనకు లేదని.. నటనను పూర్తిగా ఎంజాయ్ చేస్తానని చెబుతోంది. ప్రస్తుం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Exit mobile version