Home Cinema Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ని రిజెక్ట్ చెయ్యడానికి...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ని రిజెక్ట్ చెయ్యడానికి కారణం అదేనా..?

Chiranjeevi : రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయో మన అందరికీ తెలిసిందే. అలాగే గడిచిన రెండేళ్లలో ఆయనకీ అదే రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా పడ్డాయి. గత ఏడాది విడుదలైన ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ చిత్రాలు ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాల తర్వాత ఆయన చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

this-is-the-reason-why-chiranjeevi-rejected-family-man-web-series

ఈ సినిమా తర్వాత ఈ ఏడాది ఆయన నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఫుల్ రన్ లో ఈ సినిమా కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది అంటే ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. మెగా ఫ్యాన్స్ అందరూ ‘భోళా శంకర్’ ఫ్లాప్ పై తీవ్రమైన నిరాశతో ఉన్నారు. ఇలాంటి సమయం లో చిరంజీవి చేసిన ఒక చిన్న పొరపాటు గురించి తెలిసి సోషల్ మీడియా లో అభిమానులు తెగ ఫైర్ అయిపోతున్నారు.

అసలు విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అయినా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రాజ్ & డీకే దర్శకత్వం లో వచ్చిన ఈ సిరీస్ ఇండియన్ వెబ్ సిరీస్ గా తెరకెక్కి, ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపుని దక్కించుకుంది. ఈ సిరీస్ లో మనోజ్ బాజపాయ్ లీడ్ రోల్ లో నటించాడు. ఆయనకీ భార్య గా ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియమణి నటించింది.

రెండు సీజన్స్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సెకండ్ సీజన్ స్టార్ హీరోయిన్ సమంత విలన్ గా నటించింది, ఆమెకి ఎంత మంచి పేరు వచ్చిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ ని తొలుత సినిమాగా తీద్దాం అనుకున్నారట రాజ్ & డీకే. మెగాస్టార్(Chiranjeevi) చిరంజీవి ని కలిసి స్టోరీ చెప్పగా, ఆయన ఎంతగానో నచ్చాడు.

కానీ రీసెంట్ గానే ‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను, అది పూర్తి గా కమర్షియల్ సినిమా, ఇంతలోపే ఇద్దరు పిల్లలకు తండ్రి పాత్ర పోషిస్తే అభిమానులు తీసుకోలేరేమో అని ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్నీ తెలుసుకొని మెగా ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.

Exit mobile version