Home Cinema Hema : హేమాను వదిలిపెట్టమని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న పొలిటికల్ లీడర్.. ఎవరంటే..

Hema : హేమాను వదిలిపెట్టమని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న పొలిటికల్ లీడర్.. ఎవరంటే..

Hema : బెంగుళూరులో జరిగే రేవ్ పార్టీ అందరిని షాక్‌కి గురిచేస్తూ ఉండడం మనం రోజూ చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఓ పార్టీలో 100 మందికిపైగా టాప్ సెలబ్రిటీలు హాజరై పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రముఖ తారలకు నోటీసులు కూడా జారీ చేశారు. వీరిలో మన తెలుగు నటి హేమ కూడా ఉండటం గమనార్హం. కానీ నటి హేమ మాత్రం పోలీసుల విచారణలో పాల్గొనకపోవడం పెద్ద చర్చగా మారింది.

తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు లేఖ రాసింది. అయితే పోలీసులు ఈ లేఖను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ నెట్ లో బాగా స్ప్రెడ్ అవుతోంది. బెంగుళూరు సీసీబీ హేమను కేసు నుంచి తప్పించేందుకు ఓ ప్రధాన రాజకీయ నేత ప్రయత్నిస్తున్నారనేది ఇండస్ట్రీలో ట్రెండింగ్ టాపిక్. హేమను అరెస్ట్ చేయొద్దని, విచారణ పూర్తి చేసిన తర్వాతే విడుదల చేయాలని సీసీబీ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి.

political-leader-helping-hema-by-calling-police-and-settling-down-issue

హేమ రాజకీయ నేపథ్యం కారణంగా పోలీసుల విచారణలో పాల్గొనలేదని సమాచారం. అంతేకాదు హేమను వదిలేయాలని సీసీబీ పోలీసు అధికారులను పదే పదే ఒత్తిడి చేస్తున్న సదరు నేత కూడా పెద్దవారు కావడంతో తెరవెనుక కథనాలు చాలానే వస్తున్నాయి . కన్నడ మీడియాలో ఓ తెలుగు నటి గురించి ఇలాంటి వార్తలు విని తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీకి 100 మందికి పైగా హాజరుకాగా, 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రక్తపరీక్షల్లో తేలింది.

Exit mobile version