Home Cinema Jyothika : జ్యోతిక పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ నటుడు.. సూర్య తండ్రిని..

Jyothika : జ్యోతిక పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ నటుడు.. సూర్య తండ్రిని..

Jyothika : కోలీవుడ్‌ ఇండస్ట్రీలోని అత్యంత ప్రసిద్ధి చెందినా జంటలలో సూర్య జ్యోతిక ఒకరు. అప్పట్లో వీరు పెద్దలకు తెలియకుండా ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొని మళ్లీ ఇంట్లో ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ సూర్య తండ్రి జ్యోతికకు ముందుగానే ఒక షరతు పెట్టారట. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తాను అని. దీనికి జ్యోతిక కూడా ఓకే చెప్పడంతో వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక జ్యోతిక తన కుటుంబ బాధ్యతలను స్వీకరించింది.

ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యాక సూర్యని ఒప్పించి మళ్లీ సినిమాల్లో కనిపించింది. అయితే, గత కొన్ని రోజులుగా జ్యోతిక గురించి కోలీవుడ్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే, జ్యోతిక తన అత్తమామల నుండి విడిపోయి ముంబైలో స్థిరపడింది. అంతే కాదు తమిళనాడులో గత ఎన్నికల సమయంలో సూర్య మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జ్యోతిక ఓటు కు రాలేదు. ఆ సమయంలో ఆమె నేపాల్‌లో పర్యటిస్తూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో చాలా మంది ఆమెపై వ్యాఖ్యలు చేశారు.

this-actor-made-sensational-commnets-on-jyothika-suriya-as-she-does-not-shown-up-for-voting

తాజాగా తమిళ నటుడు, సినీ విశ్లేషకుడు బైల్వన్ రంగనాథన్ కూడా ఈ విషయంపై షాకింగ్ ప్రకటన చేశారు. ఓటింగ్ సమయంలో సూర్య మాత్రమే హాజరుకాగా జ్యోతిక రాలేదు అనే విషయం ఇపుడు ప్రశ్నముసనీయంగా మారింది. సూర్య అభిమానులు అత్తారింటి పరువు తీస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే సూర్య వరుస సినిమాలతో దూసుకపోతున్నాడు. ఈయన చేతిలో బారి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక జ్యోతిక ఇప్పటికి ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు అని తెలుస్తుంది.

Exit mobile version