Uday Kiran : టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా అతి తక్కువ మందిలో ఒకడు ఉదయ్ కిరణ్. ఈయన హీరోగా(Uday Kiran Sister) నటించిన మొదటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అప్పటి స్టార్ హీరోస్ హిట్ మూవీస్ కలెక్షన్స్ ని అవలీలగా దాటేసి ఉదయ్ కిరణ్ సత్తా చాటాయి. ఆ రోజుల్లో యూత్ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు ఉదయ్ కిరణ్.
కానీ ఆ మొదటి మూడు సినిమాలే ఉదయ్ కిరణ్ కి గోల్డెన్ డేస్ లాంటిది, ఆ తర్వాత వచ్చినవి మొత్తం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. విడుదలైన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో ఉదయ్ కిరణ్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఆయనకీ అలా నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అలా అవకాశాలు తగ్గిపోవడం తో ఉదయ్ కిరణ్ ఆర్థికంగా బాగా నష్టపోయి ఎంతో మనస్తాపానికి గురి అయ్యాడు.
చివరికి భార్య సంపాదన మీద బ్రతకడం ఇష్టం లేక, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది. ఇప్పటికీ కూడా ఆయన మరణం ని మనమెవ్వరం మర్చిపోలేకపోతున్నాం, దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు జనాల్లో ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో. ఇకపోతే ఉదయకిరణ్ చెల్లెలు టాలీవుడ్ లో ఒక టాప్ మోస్ట్ సింగర్ అనే విషయం చాలా మందికి తెలియదు.
ఉదయ్ కిరణ్ తల్లి సోదరి కూతురు(Uday Kiran Sister) పర్ణిక టాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఈమె ఇప్పటి వరకు బాహుబలి , భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు పాటలు పాడింది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు , బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు పాడింది.
ముక్యముగా ఈమె అయిగిరి నందిని పాట తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యింది. ఉదయ్ కిరణ్ బ్రతికి ఉన్నన్ని రోజులు పర్ణిక కి ఎంతో సపోర్టివ్ గా నిలిచేవాడట. తన సొంత అక్కయ్య ని ఎంత ప్రేమగా చూసుకునేవాడో, పర్ణిక ని కూడా అదే రేంజ్ లో చూసుకునేవాడు అట.